జగన్ డేరింగ్ డాషింగ్ నిర్ణయం…పక్కనే ఉన్న సజ్జల కూడా ఖంగుతున్నాడు!

YS Jagan government

YS Jagan makes a key decision on Amaravati

రాష్ట్రంలో ప్రజలను కరోనా పట్టి పడిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులను మాత్రం రాజధాని అనే అంశం అనే ఒక మహమ్మరిలా పట్టి పడిస్తుంది. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి ఏపీ ప్రభుత్వం గవర్నర్ చేత ఆమోదం పొందిన తరువాత దానికి సంబంధించిన రంగం మరింత వేగవంతం పెంచింది. ఈనెల 16న శంకు స్థాపన చేయబోతున్నామని వైసీపీ నాయకులు అనుకుంటున్న తరుణంలో హై కోర్టు రూపంలో ఒక అడ్డంకి వచ్చిపడింది. అమరవతి రైతులు రాజధాని తరలింపుపై పిటిషన్ దాఖలు చేయడంతో వికేంద్రకరణ సీఆర్డీఏ బిల్లులను తాత్కాలికంగా నిలిపివేస్తూ హై కోర్టు స్టేటస్ కోప్రకటించింది.

YS Jagan government
Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy

హై కోర్టు నిర్ణయాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటే కాబట్టి మళ్ళీ హై కోర్టు తీర్పు పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ కేసు సోమవారం విచారణకు వస్తుందని అందరూ అనుకున్నారు కానీ విచారణకు రాకపోవడంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ కేసును వెంటనే విచారించాలని ఏపీ ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. ప్రతివాదులకు ఆల్రెడీ పిటిషన్ కాపీలు ముందే పంపిన్నందున ఈ కేసును వీలైనంత త్వరగా విచారించాలని లేఖలో పేర్కొన్నారు. అసలే స్టేటస్ కో పై కోర్టుకు వెళ్లడం వల్ల ఒరిగేది ఏమి లేదని న్యాయ పండితులు అంటున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం ఏకంగా సుప్రీం లేఖకు రాయడంపై న్యాయ పండితులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. లేఖ రాసిన ప్రభుత్వం సుప్రీంలో ఎలా వాదించనుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Read More – Why Amaravati can never be Capital again?

సుప్రీంకు వెళ్లిన ప్రతిసారి వైసీపీ ప్రభుత్వానికి ఘోర అవమానమే జరిగింది. రంగుల విషయంలో వెళ్ళినప్పుడు, డాక్టర్ సుధాకర్ విషయంలో వెళ్ళినప్పుడు, ఇంగ్లీష్ మీడియంపై వెళ్లినప్పుడు, ఈసీ రమేష్ కుమార్ విషయంలో వెళ్ళినపుడు సుప్రీం తీర్పు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. అయితే ఈసారి జగన్ తీసుకుంటున్న ఈ డాషింగ్ నిర్ణయాల వల్ల ఎదో పెద్ద ప్లాన్ వేసి ఉంటారని అనుకుంటున్నారు. కనీసం ఈసారైనా సుప్రీం దగ్గర వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందో లేదో చూడాలి.

YS Jagan wrote a letter to supreme take up the Amaravati case at the earliest and pronounce its Judgement.

Read more about Amaravati Metropolitan Development Area