యెల్లో ఫీవర్ నుంచి పవన్ కళ్యాణ్ బయటకు రాగలరా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిసారీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్‌నే ఎంచుకుంటుంటారు. లేకపోతే, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగేదే. రాజకీయాలన్నాక రాజకీయ విమర్శలు తప్పుకాదు. అధికార పార్టీని ప్రశ్నించడమే విపక్షాల పని. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. విపక్షాలు ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం కూడా వుంటుంది. కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయం చాలా చాలా చిత్రమైనది. టీడీపీ అధికారంలో వున్నప్పుడూ వైసీపీనే విమర్శించారు.. వైసీపీ అధికారంలో వున్నప్పుడూ వైసీపీనే విమర్శిస్తున్నారు. టీడీపీని జనసేనాని విమర్శించలేదని కాదు. కానీ, టీడీపీతో జనసేన అంటకాగుతూనే వున్న వైనం, జనసైనికుల్ని ‘పచ్చ బానిసలు’ అనే స్థాయికి తీసుకెళ్ళపోయింది.

జనసేనను నిండా ముంచేస్తోన్న ‘యెల్లో’ గాసిప్స్.!

ఇప్పటికిప్పుడు జనసేన అధినేత ఈ యెల్లో ఫీవర్ నుంచి బయటకు రావడం కష్టం. అధికార వైసీపీకి ఇదే పెద్ద ఆయుధం. పవన్ కళ్యాణ్ అంటే టీడీపీనే.. అన్న బలమైన ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్ళగలుగుతోంది వైసీపీ. ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అని జనసేన వ్యాఖ్యానించేశాక, ‘జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి’ అని మాత్రం ఏం ప్రయోజనం.?

చంద్రబాబు టెన్షన్ కు కారణాలు అవేనా ?

టీడీపీ కూడా జనసేనానికి సోకిన ఎల్లో ఫీవర్ పట్ల ఎంజాయ్ చేస్తూనే వుంది. టీడీపీ సోషల్ మీడియా విభాగం తరచూ పవన్ కళ్యాణ్‌ని రాజకీయంగా, సినిమాల పరంగా ట్రోల్ చేస్తూనే వుంటుంది. ఆ విభాగం నారా లోకేష్ కనుసన్నల్లో, చంద్రబాబు ఆదేశాల మేరకే జరుగుతుంటుంది. కాస్తో కూస్తో వైసీపీ సోషల్ మీడియా విభాగం అయినా జనసేనను లైట్ తీసుకుంటుందేమోగానీ, టీడీపీ సోషల్ మీడియా విభాగం మాత్రం జనసేనను టార్గెట్ చేస్తూనే వుంటుంది. అయినా, ఈ వాస్తవం పవన్ కళ్యాణ్‌కి అర్థం కావడంలేదు.

వైఎస్ జగన్ సారూ.! కొంప ముంచేది ‘సొంత’ మీడియానే.!