వైఎస్ జ‌గ‌న్‌తో యూఎస్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ భేటీ

ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్‌లోని అమెరిక‌న్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ క్యాథ‌రిన్ హ‌డ్డా బుధ‌వారం ఉద‌యం ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో స‌మావేశం అయ్యారు. హైద‌రాబాద్ లోట‌స్‌పాండ్‌లోని జ‌గ‌న్ ఇంట్లో ఈ భేటీ ఏర్పాటైంది. జాతిపిత మ‌హాత్మాగాంధీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.

అనంత‌రం సుమారు 20 నిమిషాల పాటు క్యాథ‌రిన్.. జ‌గ‌న్‌తో స‌మావేశం అయ్యారు. ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలోనే హైద‌రాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ ఏర్పాటైంద‌ని క్యాథ‌రిన్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. క్యాథ‌రిన్ హ‌డ్డా మ‌ర్యాద‌పూర‌కంగా జ‌గ‌న్‌ను క‌లిసిన‌ట్లు వైఎస్ఆర్ సీపీ శ్రేణులు చెబుతున్నారు.