Sai Durga Tej: కొత్త సినిమాను ప్రారంభించిన సాయిదుర్గా తేజ్‌!

Sai Durga Tej: వైవిధ్యమైన కథలు ఎంచుకునే హీరోల్లో సాయి దుర్గా తేజ్‌ (Sai Durga Tej) ఒకరు. ‘విరూపాక్ష’, ‘బ్రో’ తర్వాత ఇప్పుడు మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ యంగ్‌ హీరో పుట్టినరోజు సందర్భంగా మంగళవారం కొత్త సినిమాను ప్రకటించారు. ‘ఎస్‌డిటి18’ (Sai Durga Tej) వర్కింగ్‌ టైటిల్‌తో ఇది తెరకెక్కనుంది.

Sai Durgha Tej: సాయి దుర్గ తేజ్, #SDT18 “ఇంట్రూడ్ ఇన్‌టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ” రిలీజ్

ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ఓ మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది. ‘హనుమాన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించిన కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ‘ధైర్యాన్నే తన కవచంగా, ఆశనే ఆయుధంగా చేసుకున్న ఈ వ్యక్తి అందరికోసం నిలబడతాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే’ అనే క్యాప్షన్‌తో ఓ వీడియోను విడుదల చేస్తూ చిత్రబృందం సాయి దుర్గా తేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

Prof. Kancha Ilaiah EXSPOSED Pawan Kalyan Politics With BJP & Modi || Chandrababu || Ys Jagan || TR