అరుదైన నాణేలతో నిజంగా కోట్ల రూపాయలు సంపాదించవచ్చా.. ఏం చేయాలంటే?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో పాత నాణేలు మీ దగ్గర ఉంటే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించవచ్చంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఆ వార్తలు చూసి చాలామంది నిజంగానే పాత నాణేల ద్వారా అంత ఎక్కువ మొత్తం సంపాదించవచ్చా అంటూ ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే అరుదైన నాణేలతో నిజంగానే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు.

మన దగ్గర ఉన్న నాణేలు రాజుల కాలం నాటి నాణేలు కావడంతో పాటు ఆ నాణేలకు ఎన్నో ప్రత్యేకతలు ఉంటే మాత్రమే కోట్ల రూపాయలు సంపాదించడం సాధ్యం అవుతుందని చెప్పవచ్చు. అన్ని నాణేలకు ఎక్కువ ధర లభిస్తుందని భావించడం మాత్రం కరెక్ట్ కాదు. కొన్ని నాణేలు తక్కువ ధరకే ఆన్ లైన్ లో లభ్యమవుతాయనే సంగతి తెలిసిందే. అందువల్ల అలాంటి నాణేలతో ఎలాంటి ప్రయోజనం ఉండదు.

అరుదైన నాణేలను తరచూ సేకరించే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. అరుదైన నాణేలు ఉంటే కోటీశ్వరులు అవుతామని భావిస్తే కూడా మూర్ఖత్వమే అవుతుందని చెప్పవచ్చు. ఎక్కడా దొరకని కాయిన్లకు మాత్రమే ఉంటుంది. కొంతమంది అరుదైన నాణేలను కొనుగోలు చేస్తామంటూ మాయ మాటలు చెప్పి మోసాలు చేస్తున్న సందర్భాలు సైతం ఎక్కువగానే ఉన్నాయనే సంగతి తెలిసిందే.

అరుదైన నాణేలకు సంబంధించి వాస్తవాల కంటే అపోహలు ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయనే సంగతి తెలిసిందే. అధికారులు సైతం చొరవ చూపి ఇందుకు సంబంధించి క్లారిటీ ఇవ్వడంలో ఆసక్తి చూపడం లేదు. ప్రముఖ ఈకామర్స్ వెబ్ సైట్లలో, హైదరాబాద్ లోని కొన్ని మార్కెట్లలో సైతం పాత నాణేలు సులువుగా దొరుకుతున్నాయి. అలాంటి నాణేల వల్ల పెద్దగా ప్రయోజనం అయితే ఉండదని చెప్పవచ్చు.