Pushpa 2: పుష్ప-2 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ పుష్పరాజ్‌ పోస్టర్‌తో అప్‌డేట్‌ వదిలిన మేకర్స్‌ డిసెంబరు 6

Pushpa 2: ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి పుష్ప-2 దిరూల్‌ (Pushpa 2: The Rule) మీదే. ఈ సినిమాకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా భారతీయ సినీ పరిశ్రమ యావత్‌ ఎదురుచూస్తున్న సినిమా ఇది. అది మన తెలుగు సినిమా కావడం గర్వకారణం. ఇక ‘పుష్ప-2’ ది రూల్‌.. (Pushpa 2: The Rule) డిసెంబరు 6న ప్రారంభం కానున్న పుష్పరాజ్‌ రూల్‌కు కౌంట్‌స్టార్‌ అయ్యింది. మరో50 రోజుల్లో అంటే డిసెంబరు 6న పుష్ప-2 రూల్‌ (Pushpa 2: The Rule) బాక్సాఫీస్‌పై ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా మేకర్స్‌ ఐకాన్‌స్టార్‌ (Allu Arjun) మాసివ్‌ లుక్‌తో పుష్పరాజ్‌గా రూల్‌ చేయడానికి సింహాసనం అధిష్టించిన ఓ పోస్టర్‌ను వదిలారు. అంతేకాదు డిసెంబరు 6న భారతీయ సినిమాలో ఆ రోజు ఓ సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుందని హింట్‌ ఇచ్చారు మేకర్స్‌ ప్రతి సీన్‌కు గూజ్‌బంప్స్‌తో పాటు పుష్ప ది రూల్‌కు (Pushpa 2: The Rule) అందరూ ఫిదా అయిపోవాల్సిందే అంటున్నారు. మీరు ఎంత ఊహించుకుంటే అంతకు మించి.. అస్సలు తగ్గేదెలే లా చిత్రం వుండబోతుందనే విశ్వాసంతో వున్నారు చిత్ర మేకర్స్‌.

Pushpa 2: ‘పుష్ప2’ కోసం శరవేగంగా షూటింగ్‌

పుష్ప దిరైజ్‌తో (Pushpa 2: The Rule) బార్డర్‌లు దాటిన ఇమేజ్‌తో.. అద్వితీయమైన నటనతో.. ఎవరూ ఎక్స్‌పెక్ట్‌ చేయని క్రేజ్‌తో దూసుకపోతున్న ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) ‘పుష్ప-2’లో (Pushpa 2: The Rule) మైస్మరైజింగ్‌ నటన కోసం, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ టేకింగ్‌.. మేకింగ్‌.. కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల పతాకంపై ప్రముఖ నిర్మాతలు, నవీన్ ఏర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు సాంగ్స్‌, టీజర్‌కు ఎంతటి అనూహ్యమైన స్పందన వచ్చిందో తెలిసిందే. దేవి శ్రీప్రసాద్‌ అందించిన అందించిన ట్రెండీ పాటలకు అద్వితీయమైన స్పందన వచ్చింది. ఇక పుష్ప-2 ది రూల్‌ (Pushpa 2: The Rule) నుండి రానున్న ప్రతి ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా అంతే క్రేజీతో రాబోతుంది.

Pushpa 2: అల్లు అర్జున్‌ ‘పుష్ప- 2 ది రూల్‌’ ఫస్టాఫ్‌ లాక్‌.. డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల

ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో వున్న ఈ చిత్రం, మరోవైపు నిర్మాణానంతర పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌హాఫ్‌ పర్‌ఫెక్ట్‌ లాక్ అయిన సంగతి తెలిసిందే. కంటెంట్‌ పరంగానే కాకుండా టెక్నికల్‌గా కూడా పుష్ప-2 (Pushpa 2: The Rule) అత్యున్నత స్థాయిలో వుండబోతుంది. ఇక డిసెంబరు 6న అందరూ పుష్ప ది రూల్‌ (Pushpa 2: The Rule) డే అని ఎదురుచూస్తున్నారు.

తారాగణం: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

సాంకేతిక సిబ్బంది:

కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్
సీఈఓ: చెర్రీ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్

Akhanda 2 Under Fire: Dasari Vignan's Shocking Statements | Devara 2 || Balakrishna, Jr NTR || TR