మీ దగ్గర చిరిగిన నోట్లు ఉన్నాయా.. ఆ నోట్లను ఏ విధంగా మార్చుకోవాలో మీకు తెలుసా?

మనలో చాలా మంది చిరిగిన నోట్ల వల్ల ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు పడే ఉంటారు. కొన్నిసార్లు ఏటీఎంలలో సైతం చిరిగిన నోట్లు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో కొంతమంది ఏం చేయాలో పాలుపోక ఇబ్బందులు పడుతూ ఉంటారు. చిరిగిన నోట్లను ఎవరికైనా ఇవ్వడానికి ప్రయత్నించినా ఆ నోట్లను తీసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపించరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సాధారణంగా మన దగ్గర ఉన్న చిరిగిన నోట్లను వైట్ కలర్ టేప్ ద్వారా అతికించి బ్యాంకులో మార్చుకోవచ్చు. నోట్లు మరీ వినియోగించడానికి పనికి రాని విధంగా ఉంటే మాత్రం ఆ నోట్లను మార్చుకోవడం సాధ్యం కాదని చెప్పవచ్చు. ఏటీఎంలలో చిరిగిన నోట్లు వస్తే మాత్రం బ్యాంక్ అధికారులు వాటిని మార్చే విషయంలో నిరాకరించకూడదు. చిరిగిన నోట్లు ఇచ్చిన బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా నోట్లను మార్చుకోవచ్చు.

పాడైపోయిన నోట్లను బ్యాంక్ బ్రాంచ్ ద్వారా మార్చడం సాధ్యం కాని పక్షంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల ద్వారా సులువుగా మార్చుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఒక వ్యక్తి గరిష్టంగా 5000 రూపాయల వరకు 20 నోట్లను మాత్రం మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అంతకు మించి మార్చుకోవడం అయితే సాధ్యం కాదని చెప్పవచ్చు.

పాడైన నోట్లకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా వాటిని నివృత్తి చేసుకోవచ్చు. పాడైన నోట్లను దాచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు.