బెజవాడలో బాబు పడవ ప్రయాణం.. అమరావతి కొంప ముంచుతుందా?

భారీ వరదలతో విజయవాడ నగరం అతలాకుతలం అయ్యింది. గతంలో ఎన్నడూ చూడని ప్రకృతి విపత్తును నగర ప్రజలు ఎదుర్కొన్న్నారు! ఈ నేపథ్యంలో ప్రభుత్వ సాయంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలపై నిప్పులు కక్కుతున్న వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.

ఇక ఈ పాపం మొత్తం చంద్రబాబుదే.. కరకట్ట వద్ద ఉన్న ఆయన నివాసం వరదల్లో మునిగిపోకుండా ఉండటం కోసం బుడమేరు నదిపై ఉన్న రెగ్యులేటర్ 11 గేట్లు ఎత్తేశారు.. ఫలితంగా భారీగా వరద నీరు ప్రజలను అల్లకల్లోలం చేసింది.. పోని ఆ పని చేస్తున్నపుడు ప్రజలను అలర్ట్ కూడా చేయలేదు అన్నట్లుగా జగన్ ఫైరయ్యారు.

దీనిపై పలువురు అర్ధజ్ఞానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారని అంటున్నారు! ఆ సంగతి అలా ఉంటే… గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో విజయవాడ నగరం ఇలా వరదల్లో చిక్కుపోవడంతో పాటు.. గత పదేళ్లుగా ఏపీకి రాజధాని అని చెబుతున్న అమరావతి మునక ఇప్పుడు వైరల్ గా మారింది!

ఏపీ రాజధానిగా చెబుతున్న అమరావతి ఈ వర్షాలలో మునగలేదు.. భారీ వర్షాల వల్ల వచ్చిన వరద నీరు అమరావతిని తాకలేదు అన్నట్లుగా పలు మీడియా సంస్థలు సైతం కళ్లుండి చూడలేని పరిస్థితి అనే కామెంట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు కు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నేషనల్ మీడియాలో వైరల్ గా మారిది.

అవును… విజయవాడలో ఈ స్థాయిలో వరదలు రావడం కచ్చితంగా మానవతప్పిదమే అని పలువురు ప్రజానికం బలంగా తమ వాయిస్ ని వినిపిస్తున్న నేపథ్యంలో.. బాబు విజయవాడ వీధుల్లో బోటు ప్రయాణం చేశారు. దీంతో.. ఈ పిక్ ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ పిక్ ని పెద్ద పెద్ద ఫోటోలు వేసి మరీ ఇది విజయవాడ, ఏపీ రాజధాని ప్రాంత పరిస్థితి అని కవరేజ్ ఇస్తుంది!

శతాబ్ధాల చరిత్ర కలిగిన విజయవాడ తాజాగా వచ్చిన వరదలతో ఎలా మునిగిందో జాతీయ మీడియా వివరిస్తూ భారీ కథనాలు ప్రసారం చేసింది! అమరావతిలో భారీ వర్షాల వల్ల అతలాకుతలం అయిన పరిస్థితిని కూడా కవరేజ్ చేస్తూ ఫుల్ ఫోకస్ అక్కడ పెట్టిన పరిస్థితి. దీంతో ఇప్పుడు చర్చ అంత విజయవాడ మునక కంటే ఎక్కువగా అమరావతి లో పడవ ప్రయాణంపైనే జరుగుతుంది.

వాస్తవానికి ఈ టెర్మ్ లో చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసి తీరాలని తమ్ముళ్లు భావిస్తున్నారు. అలా కాని పక్షంలో రాబోయె పరిణామాలు, పరిస్థితుల గురించి చెప్పె పని లేదని అంటున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా వచ్చి పడిన భారీ వర్షాలు, వరదలు ఇప్పుడు అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని తిబ్బ తీసేలా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రధానంగా అమరావతి అనుకున్నస్థాయిలో పూర్తి అవ్వాలంటే… కేంద్రం ఇప్పించే అప్పు ఎ మూలకూ రాదని.. భారీగా పెట్టుబడులు వస్తేనే పరిస్థితి బాగుంటుందని చెబుతున్నారు. అయితే… ఇప్పుడు వచ్చిన భారీ వరదలు పంటపొలాల్లో రాజధాని నిర్మాణం చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టేలా ఉన్నాయనే చర్చ వినిపిస్తుంది.

మరి ఈ సమయంలో… అమరావతిపై పడిన నెగిటివిటీని బాబు & కో ఏ మేరకు కవర్ చేస్తారు.. మసి పూసి మారేడు కాయ చేసి అయినా అమరావతికి పెట్టుబడులను ఆకర్షించగలుగుతారా.. లేక, వరదల పాపం కూడా గత ప్రభుత్వందే అని చెప్పి ఇప్పటి నుంచే జనాలను ప్రిపేర్ చేస్తారా అనేది వేచి చూడాలి!

ఒకవేళ జగన్ చెబుతున్నట్లు… బుడమేరు గేట్లు ఎత్తివేయడం, కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసాన్ని కాపాడటం కోసమే అయ్యి ఉంటే.. కచ్చితంగా అమరావతిని బాబె నాశనం చేసినట్లు అని భావించొచ్చు అని అంటున్నారు పరిశీలకులు.