వైసిపి సోషల్ మీడియా దెబ్బకు  కళ్ళు బైర్లుకమ్మాయి

వైసిపి సోషల్ మీడియా దెబ్బకు చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి కళ్ళు బైర్లుకమ్మింది. విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఘటన జరిగిన అర్ధగంట నుండి డిజిపి, మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు చివరకు రాత్రి చంద్రబాబునాయుడు మీడియా సమావేశాలు నిర్వహించి నోటికొచ్చినట్లు మాట్లాడారు. సరే ఎవరు మాట్లాడినా దాడి చేసింది వైసిపి అభిమానే అని, దాడిలో కుట్ర దాగుందని ఇలా…చాలానే చెప్పారు. జగన్ ను ఎగతాళి చేస్తూ మాట్లాడిన విషయం అందరూ చూసిందే. అసలు దాడి జరిగిన తర్వాత నుండి ఘటన తాలూయు పొటోలను, వివరాలను సోషల్ మీడియా విభాగమే ప్రపంచానికిి తెలియజెప్పింది.

 

మొదట డిజిపి ఠాకూర్ మాట్లాడుతూ సానుభూతి కోసమే నిందితుడు జగన్ పై దాడి చేసుంటాడని, ప్రచారం కోసమే దాడి జరిగిందని, దాడి చేసింది వైసిపి అభిమానే అని, విమానశ్రయంలోపల భద్రత తమ పరిధిలోది కాదని సొల్లు కబుర్లు చాలానే చెప్పారు. దానికి అప్పటికప్పుడే వైసిపి సోషల్ మీడియా విభాగం నుండి కౌంటర్లు మొదలైపోయాయి.

ఏడాది క్రితం విశాఖపట్నం విమానాశ్రయం రన్ వే పైనే పోలీసులు జగన్ ను అదుపులోకి తీసుకున్న విషయాన్ని బయటకు తీసింది. అప్పటి ఫొటోలను,  వీడియో క్లిప్పింగులతో సహా ప్రచారంలోకి తెచ్చింది.

ఇక, మంత్రులు, ప్రజా ప్రతినిధులు చివరకు చంద్రబాబు చేసిన కామెంట్లు, ఆరోపణలను చీల్చి చెండాడేసింది. పాయింట్ బై పాయింట్ బయటకు తీసి ఉతికి ఆరేసింది.

చంద్రబాబు ప్రతీ ఆరోపణకు, ప్రతీ విమర్శకు వైసిపి సోషల్ మీడియా ఎప్పటెప్పట్టివో ఘటనలను తవ్వితీసి బయటపెట్టి చంద్రబాబు దుమ్ము దులిపేసింది.

సోషల్ మీడియా విభాగంలో ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్ తదితరాల ద్వారా జనాలకు చంద్రబాబు చెప్పిందేమిటి,  వాస్తవాలేమిటి అన్న విషయాలను విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది.

చంద్రబాబుకు, తెలుగుదేశంపార్టీకి వ్యతిరేకంగా ఒకవైపు జగన్ మీడియా సాక్షి మరోవైపు సోషల్ మీడియా విభాగం దుమ్ముదులిపేస్తోంది. వైసిపి సోషల్ మీడియా విభాగాన్ని ఈమధ్యనే స్ట్రెగ్తెన్ చేశారు.

నిజానికి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జగన్ సోషల్ మీడియాను బలోపేతం చేశారు. రాష్ట్రంలోని సుమారు 640 మండలాల్లో ప్రత్యేకంగా కమిటీలు వేశారు. ప్రతీ కమిటిలోను బాగా యాక్టివ్ గా ఉండే 15 మంది యువకులను నియమించారు.

 

వచ్చే ఎన్నికల కోసం నియమించిన కమిటీలు జగన్ పై హత్యయత్నం ఘటనతో ఒక్కసారిగా రెచ్చిపోతోంది. మొత్తంమీద వైసిపి సోషల్ మీడియా దెబ్బకు ఇటు తెలుగుదేశంపార్టీ అటు ప్రభుత్వం ఒకేసారి కుదేలైపోయాయి.