ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుచూపు ఉన్న రాజకీయ నేత అనే సంగతి తెలిసిందే. భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జగన్ ఏ నిర్ణయాన్ని అయినా తీసుకుంటారు. సీఎంగా ఎంత బిజీగా ఉన్నా జగన్ కుటుంబానికి కూడా ఎంతగానో ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. అయితే జగన్ చెల్లెళ్లను బాధ పెడుతున్నారని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కామెంట్లు చేశారు. అయితే వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.
నిజం ఏంటంటే చెల్లెళ్లే ఒక విధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఎంతగానో బాధ పెడుతున్నారు. వాస్తవానికి జగన్ వైసీపీని తెలంగాణలో కొనసాగించాలని అనుకుంటే కొనసాగించేవారు. కానీ ఏపీకి మాత్రమే పరిమితం కావాలని భావించి జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవడం జరిగింది. అయితే షర్మిల మాత్రం జగన్ కు ఇష్టం లేకపోయినా తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ అధికారంలోకి రావాలని భావిస్తున్నారు.
అయితే షర్మిల రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీ పెట్టారే తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదని చాలామంది భావిస్తున్నారు. షర్మిల పార్టీ కనీసం ఒక్క సీటులో అయినా గెలవడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరో చెల్లెలు సునీత వివేకానందరెడ్డి హత్య కేసులో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కోర్టులను ఆశ్రయించడంలో తప్పేం లేకపోయినా ఈ విధంగా చేయడం ద్వారా ప్రతిపక్షాలు జగన్ ను విమర్శించే అవకాశం ఇస్తున్నారు.
చెల్లెళ్ల వల్ల జగన్ కు జరిగిన మేలు కంటే నష్టమే ఎక్కువ అని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం. చెల్లెళ్లు జగన్ పై విమర్శలు చేస్తున్నా జగన్ మాత్రం చెల్లెళ్లపై ఎప్పుడూ విమర్శలు చేయలేదనే సంగతి తెలిసిందే. జగన్ పై విమర్శలు చేసేవాళ్లు ఈ విషయాలను కూడా గమనించాలి. కొంతమంది పొలిటికల్ బెనిఫిట్స్ కోసం చెల్లెళ్ల పేరును వాడుకుంటూ జగన్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.