షాకింగ్..పవన్ అరెస్ట్ కి రంగం సిద్ధం.?

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ రేంజ్ లో వినిపిస్తూ వస్తుంది. రీసెంట్ గా ఏపీలో నెలకొన్న పరిస్థితులు సహా సినిమా పరిశ్రమ పడుతున్న ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు చర్యలు ఆ ప్రభుత్వానికి బాగానే ఇబ్బందికరంగా ఉన్నట్టు ఉన్నాయి. అందుకే వారు కూడా గట్టిగానే ప్రతిస్పందిస్తున్నారు.

అయితే సినిమా సమస్య ఇప్పుడు పవన్ లేవనెత్తడంతో దానికి లైన్ క్లియర్ అయ్యింది. కానీ ఏపీలో పవన్ ని పొలిటికల్ గా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోడ్లు బాగుచెయ్యడంపై పవన్ పర్యటన ఉన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే పవన్ ఈరోజు రాజమండ్రిలో ల్యాండ్ అవ్వనున్నాడు.

మరి ఈ సమయంలోనే శాంతి భద్రతలు, కరోనా పరిస్థితులు దృష్ట్యా పవన్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఓ టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో ఎంతమేర నిజముందో కానీ ఇదే జరిగితే ఆ తర్వాత పరిణామాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పలేం. ప్రస్తుతం అయితే పవన్ హరిహర వీరమల్లు, భీమ్లా నాయక్ సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు.