ఆ పత్రిక విమర్శలపై కేతిరెడ్డి స్పందిస్తారా.. ఆ కథనం నిజమేనా సార్!

వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో కేతిరెడ్డికి సంబంధించిన పదుల సంఖ్యలో వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. తమ ఎమ్మెల్యే కూడా కేతిరెడ్డిలా పని చేస్తే కష్టాలే ఉండవని చాలామంది భావిస్తారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కేతిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఉంటే బాగుండేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే తాజాగా ఒక పత్రికలో కేతిరెడ్డికి వ్యతిరేకంగా కథనం ప్రచురితమైంది. ఆ కథనంలో కేతిరెడ్డి సోషల్ మీడియాలో ప్రచారం కోసం లక్షల్లో ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారుల లూప్ హోల్స్ తెలుసుకుని అధికారులతో ఈ ఎమ్మెల్యే పనులు చేయించుకుంటారని కూడా కథనాలు ప్రచారంలోకి రావడం గమనార్హం. మాజీ కలెక్టర్ గంధం చంద్రుడు బదిలీ వెనుక ఉన్న వ్యక్తి కూడా ఇతనేనని సమాచారం.

ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ ఈ ఎమ్మెల్యే పెత్తనం చలాయిస్తున్నారని సదరు కథనం సారాంశం. అధికారంలోకి వచ్చాక కేతిరెడ్డి ఆస్తులు ఊహించని స్థాయిలో పెరిగాయని తెలుస్తోంది. బోటింగ్ సరదా కోసం కేతిరెడ్డి రైతుల జీవితాలతో చెలగాటం ఆడారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. 2000 ఎకరాల భూమికి ఆధారమైన చెరువును సైతం ఈ ఎమ్మెల్యే ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

అయితే ఈ ఆరోపణల గురించి కేతిరెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కేతిరెడ్డి నిజంగా తప్పు చేసి ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలవరని కొంతమంది కామంట్లు చేస్తున్నారు. మరోవైపు జగన్ సర్కార్ పై ఈ మధ్య కాలంలో అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడంలో జగన్ సర్కార్ ఫెయిల్ అవుతుండటం గమనార్హం.