జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరిగిందని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. పవన్ పై కుట్ర చేసేదీ వైసీపీ నేతలే అని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అయితే వాస్తవాలు మాత్రం మరో విధంగా ఉన్నాయి. పవన్ పై ఎలాంటి కుట్ర జరగలేదని సమాచారం అందుతోంది. అయితే అక్కడ చోటు చేసుకున్న ఘటన వేరు అని జరిగింది మరొకటి అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
జనసేన నేతలు పబ్లిసిటీ కోసం ఈ విధంగా ప్రచారం చేసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ పై ఈ తరహా ప్రచారం వల్ల వైసీపీకి తాత్కాలికంగా నష్టం జరిగినా దీర్ఘకాలంలో జనసేన పార్టీ నష్టపోయే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు పొత్తుల గురించి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పొత్తుల గురించి పవన్ స్పందించకపోతే జనసైనికులు సైతం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ప్రజారాజ్యం పార్టీ అడుగులు వేసిన విధంగా జనసేన కూడా అడుగులు వేస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. జనసేన ఏ విధంగా పోటీ చేస్తుందో ప్రకటిస్తే అభ్యర్థులను సైతం ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. జనసేన పార్టీ మళ్లీ యాక్టివ్ కావాల్సిన అవసరం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జనసేన నేతల మనస్సులో ఏముందో క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు విశాఖలో జరుగుతున్న మోదీ సభకు పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందుతుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. మోదీ సభతో బీజేపీ జనసేన పొత్తుకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది. టీడీపీతో పొత్తుకు మాత్రం బీజేపీ నేతలు ఆసక్తి చూపడం లేదు. ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.