బ్రేకింగ్  : కూలిన తాత్కాలిక హై కోర్టు గదుల స్లాబ్..ఇవీ నాసిరకమేనా ?

ప్రపంచ స్దాయి నిర్మాణాల్లోని డొల్లతనం బయటపడింది. అమరావతి పరిధిలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక హై కోర్టు గదలు స్లాబులు కూలిపోయాయి.  హైకోర్టు భవనానికి సంబంధించి జనరేటర్ కోసం ఆరుగదులను నిర్మిస్తున్నారు. అందులో నాలుగు గదుల స్లాబులు ఈరోజు తెల్లవారి ఒక్కసారిగా కూలిపోయాయి. ఆ గదుల్లో పనిచేస్తున్న నలుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. నిర్మాణంలో ఉన్న గదులు కూలిపోవటం, నిర్మాణాలు పూర్తయిన భవనాల్లోకి వర్షపు నీరు లీకవ్వటం అందరూ చూసిందే.

ఒక భవనం కాదు ఒక గది కాదు. ఇప్పటి వరకూ చంద్రబాబునాయుడు కట్టిందంతా తాత్కాలిక భవనాలే. అసెంబ్లీ తాత్కాలికం. సచివాలయం తాత్కాలికం. ఆయన నివాసముంటున్న అక్రమ కట్టడం తాత్కాలికం. అందుకే హై కోర్టు భవనాలు కూడా తాత్కాలికంగానే నిర్మిస్తున్నారు. మళ్ళీ ప్రతీ తాత్కాలిక భవనాలకు వందలు, వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. వందలు, వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి తాత్కాలిక భవనాలు ఎందుకు కడుతున్నారో చంద్రబాబుకే తెలియాలి.

పోనీ చేస్తున్న నిర్మాణాలన్నా బ్రహ్మాండంగా ఉంటున్నాయా ? అంటే అదీ లేదు. చిన్నపాటి వర్షానికే గదులన్నీ కురుస్తుంటాయి. ఒకవైపు నిర్మాణాలు జరుగుతుండగానే మరోవైపు కట్టిన గదులు కూలిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. చంద్రబాబు హయాంలో జరుగుతున్న తాత్కాలిక నిర్మాణాలన్నీ ఎంత నాసిరకంగా ఉంటున్నాయో అందరికీ అర్ధమవుతున్నాయి. ప్రభుత్వానికి కడుతున్న తాత్కాలిక భవనాలన్నీ నాసిరకంగా కడుతున్న చంద్రబాబు సొంతానికి 22 వేల చదరపు అడుగుల్లో శాస్వత భవనం మాత్రం బ్రహ్మాండంగా నిర్మించుకోవటం గమనార్హం.