లోక్ సభలో రాహుల్.. ఇవేమి చిలిపి పనులు (వీడియో)

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లోక్ సభలో శుక్రవారం జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో నవరసాలు పండించారు. తన స్పీచ్ లో దూకుడు ప్రదర్శించిన రాహుల్ స్పీచ్ తర్వాత చిలిపి పనులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన ప్రసంగం సమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కేంద్ర సర్కారుపై ఘాటైన పదజాలంతో నిప్పులు చెరిగారు. నల్లధనం తెప్పించడంలో విషయంలో సర్కారు వైఫల్యం, నోట్ల రద్దుతో జనాల అవస్థలను ఏకరువు పెట్టారు. ఎపికి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. స్పీచ్ అయిపోగానే రాహుల్ గాంధీ నేరుగా ప్రధాని సీటు వద్దకు మెరుపు వేగంతో వెళ్లారు. వెళ్లి ప్రధానిని కౌగిలించుకున్నారు. వెంటనే ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి చక చకా వెనుదిరిగి తన సీటులో కూర్చున్నారు. రాహుల్ ఈ చర్యతో లోక్ సభలో సభ్యేల కాదు ప్రధాని కూడా పరేషాన్ అయ్యారు. కౌగిలించుకున్న తర్వాత రాహుల్ వెళ్లే సమయంలో ప్రధాని మోడీ ఏదో అంటున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇక తన సీటులో కూర్చున్న రాహుల్ గాంధీ ప్రధానిని ఓరకంట చూస్తూ కన్ను కొట్టారు. దీంతో అందరూ షాక్ అయ్యారు.

పేలుతున్న జోక్ లు :

రాహుల్ గాంధీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కౌగిలించుకోవడం, తర్వాత కన్ను కొట్టడం చూసిన కామన్ పీపుల్ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇద్దరూ బ్రహ్మచారులే కదా..? వారు ఏం చేసినా ఏం కాదులే అంటూ సెటైర్లు వేస్తున్నారు.

రాహుల్ గాంధీ ప్రధానిని కౌగిలించుకున్న వీడియో కింద ఉంది చూడండి.