ఆంధ్రా బంద్, వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్టు

రాష్ట్ర బంద్ లో పాల్గొన్న నెల్లూరు దూరదర్శన్ కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్న వైసిపి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కార్యకర్తలతో కలిసి బంద్ నిర్వహిస్తున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు,  కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా వైసిపి ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో బంద్ పాటిస్తున్నారు.  పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బంద్‌చేయిస్తున్నాయి. తెల్లవారు జామునా ఆర్టీసి డిపోల దగ్గరకొచ్చి వాహనాలు రోడ్డెక్కకుండా చేశారు. దుకాణాలు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు, పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. ఆ ఏపీ బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ నాయకులను అరెస్ట్‌ చేయిస్తోంది. తెలుగుదేశం పార్టీ బంద్ ను వ్యతిరేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పలుచోట్ల బంద్ లో పాల్గొన్న ఎమ్మెల్యేలను  పోలీసుల అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరులో ఎమ్మెలేలు రోజా, నారాయణ స్వామిలను పోలీసులు అరెస్ట్ చేశారు. బంద్ కు జనసేన  కూడా మద్దతు తెలిపింది. అరెస్టులను జనసేన నేత పవన్ కల్యాణ్ ఖండించారు.