సినిమాలలో సక్సెస్ సాధించిన పవన్ కళ్యాణ్ రాజకీయాలలో సక్సెస్ సాధిస్తారా? సాధించరా? అనే ప్రశ్నకు జనసేన నేతలు సైతం సమాధానం చెప్పలేకపోతున్నారు. పవన్ ఫుల్ టైమ్ రాజకీయాలు చేయకపోవడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేనకు అనుకూలంగా పోస్ట్ లు పెడుతూ ఛాన్స్ వచ్చిన ప్రతి సందర్భంలో ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం కొంతకాలం రాజకీయాలతో బిజీ అయితే మరి కొంతకాలం సినిమాలతో బిజీ అవుతున్నారు. పవన్ సినిమాలతో వరుసగా బిజీ అయితే మళ్లీ రాజకీయాలపై దృష్టి పెట్టేదెప్పుడని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ ప్రస్తుతం 2024 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉండగా జనసేన నుంచి పోటీ చేయడం కంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఉత్తమమని కొంతమందిలో భావన ఉంది.
మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెరైటీ రాజకీయాలు చేస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సీరియస్ రాజకీయాలు చేయకుండా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని లైట్ తీసుకున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై పవన్ సీరియస్ గా దృష్టి పెడితే మాత్రమే ఎన్నికల్లో జనసేనకు అనుకూలంగా ఫలితాలు దక్కే అవకాశాలు ఉంటాయి. ఇతర పార్టీలతో పొత్తుల వల్ల జనసేనకు నష్టమే తప్ప లాభం ఉండదనే సంగతి తెలిసిందే.
సీనియర్ ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలకే టీడీపీని అధికారంలోకి తీసుకొస్తే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి తొమ్మిది నెలలైనా పార్టీని అధికారంలోకి తీసుకొనిరావడంలో ఫెయిల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అయ్యి సినిమాలపై దృష్టి పెడితే బాగుంటుందని కొంతమంది భావిస్తున్నారు. పవన్ మనస్సులో రాజకీయాల విషయంలో ఏముందో తెలియాల్సి ఉంది. పవన్ ఇదే విధంగా రాజకీయాలు చేస్తే ఆయన పార్టీకి పొలిటికల్ ఫ్యూచర్ లేనట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
