గెలుపూ ఓటమి మధ్యలో నిమ్మగడ్డ ప్రయాణం-ఎక్కడికి చేరేనో !

nimmagadda ramesh kumar

ఏపీ హైకోర్టు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి ఒకసారి షెడ్యూల్ విడుదలయిన తర్వాత ఎన్నికలను ఆపకూడదని ఎస్ ఈ సీ తరుపున న్యాయవాది వాదించారు.

Big Twist: High Court breaks SEC lemongrass speed

ఇటు ప్రభుత్వం కూడా కరోనా వ్యాక్సినేన్ ప్రక్రియ నడుస్తున్నందున ఇప్పట్లో ఎన్నికలు జరపలేమని కోర్టుకి తెలిపింది. అయితే హైకోర్టు మాత్రం ఇటు ప్రజారోగ్యం, అటు ఎన్నికలు రెండూ ముఖ్యమేనని చెప్పింది. ఎవరికి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. ఎన్నికల కమిషన్, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించింది. కానీ హైకోర్టు సూచనలు అమలవుతాయా, అన్నది ప్రశ్నగా మారింది. హైకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు చేయడానికి రెడీ అయ్యారు. ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది.

కానీ గతంలో అనేక రాష్ట్రాల్లో ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే సుప్రీంకోర్టులో కూడా జగన్ ప్రభుత్వానికి ఇదే అనుభవం ఎదురయ్యే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు సహకరించాల్సి ఉంటుంది. మరోవైపు ఉద్యోగులు మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలో పనిచేసేందుకు సిద్దంగా లేరు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో చేరేందుకు కూడా ఎవరూ సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం హైకోర్టు తీర్పుపైన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది. ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒకరకంగా నెగ్గినట్లే. కానీ , ప్రభుత్వం ఎంతమేర ఆయనకి సహాయం అందిస్తుందో చూడాలి.