ఆ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తున్న ఏపీ సర్కార్.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీలలో నిరుద్యోగ భృతి ఒకటి కాగా వేద పండితులకు నిరుద్యోగ భృతి దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. నెలకు 3,000 రూపాయల చొప్పున సంభావన రూపంలో ఏపీ సర్కార్ ఈ మొత్తాన్ని చెల్లించనుండటం గమనార్హం.

ఏపీలో మొత్తం 7 దేవాలయాల పరిధిలో 600 మంది వేద పండితులు ఉన్నారు. శ్రీశైలం, కాణిపాకం, ద్వారకాతిరుమల, శ్రీకాళహస్తి, కనకదుర్గ, అన్నవరం, సింహాచలం ఆలయాలలోని పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించనున్నారు. మరోవైపు ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ పాలసీ 4.0కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

రాబోయే ఐదు సంవత్సరాల పాటు ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ పాలసీ 4.0కు ప్రభుత్వం ఆమోదం తెలపడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను ఈ పరిశ్రమలకు కల్పించనున్నారని సమాచారం అందుతోంది. 2029 సంవత్సరం నాటికి 4.2 లక్షల కోట్ల రూపాయల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

ఎలక్ట్రానిక్ ఉత్పత్తి రంగంలో ఆధునిక టెక్నాలజీతో పాటు పెద్దఎత్తున ఉపాధి కల్పన జరగనుందని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఏపీలోని పలు కీలక నగరాలలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు అయితే ఉన్నాయి. అయితే నిరుద్యోగ భృతిని కేవలం వేద పండితులకు మాత్రమే ప్రకటించడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.