ఏపీ మహిళలకు చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఖాతాల్లో రూ.18 వేలు పొందే ఛాన్స్!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన ప్రతి పథకాన్ని చెప్పిన విధంగా అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఖాతాలో జమ చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వగా ఆ హామీ నిలబెట్టుకునే దిశగా అడుగులు పడనున్నాయి. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉంటారు.

ఈ స్కీమ్ అమలుకు సంబంధించి విధి విధానాలు రూపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సమాచారం అందుతోంది. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు ఏడాదికి ఏకంగా 18,000 రూపాయల మొత్తం జమ కానుంది. ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి కారణమైన పథకాలలో ఈ పథకం కూడా ఒకటని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం అయితే లేదని చెప్పవచ్చు.

నెలకు 1500 రూపాయలు ప్రభుత్వం నుంచి అందడం ద్వారా మహిళలు దీర్ఘకాలంలో పొందే ప్రయోజనం అంతాఇంతా కాదు. కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను ఎవరి సపోర్ట్ లేకుండానే కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మహిళలపై ఆర్థిక భారం తగ్గించే పథకాలను కూటమి సర్కార్ అమలు చేస్తుండటంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

కూటమి సర్కార్ ప్రతి పథకాన్ని వేగంగా అమలు చేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ప్రయోజనాలను ప్రజలు పొందవచ్చు. ఏపీ సర్కార్ ఒకవైపు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా కూటమి నిర్ణయాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.