గుడివాడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ నాయకుడు కొడాలి నాని ఈ రోజు తెలుగు దేశం తీరు మీద ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఛాలెంజ్ విసిరారు.
ఈ రోజు వైసిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన పార్టీ జండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేయించారు. తర్వాత ప్రసంగిస్తూ చంద్రబాబు ను తీవ్రంగా విమర్శించారు.
గుడివాడలో వైసిపి క్యాండిడేట్ నేనే అని ప్రకటించారు. గతంలో నే ఈ విషయం ప్రకటించానని,ప్రజలు మేలు గురించి మోసాలు,ద్రోహాలు, వెన్నుపోట్ల గురించి ఆలోచించని పార్టీ నేత జగన్ ను చూసి తనకు వోటేయాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే, గుడివాడలో తన మీద పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థే దొరకలేదా అని ఆశ్చర్యపోయారు. తన మీద పోటీ కి బయటినుంచి అభ్యర్థిని తెస్తున్నారని, అయినా సరే గెలుపు వైసిపిదే నని ఆయన ధీమా గాచెప్పారు. తనకు తిరుగులేదని ఎపుడో చంద్రబాబు నాయుడే రాజముద్రవేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అద ఇపుడు రుజువయింది.తన మీద పోటీ చేసే సత్తా వున్నవాడే టిడిపిలో లేడని అన్నారు.
గుడివాడ జనాభా రెండు లక్షలు, తెలుగుదేశం సభ్యత్వం నలభైవేలు. అయితే, ఈ నలభై వేలలో ఒక్కరు కూడా నాతో పోటీ పడేవాళ్లు లేరని టిడిపి గుర్తించి తనకు కుపోటీగా బయటి నుంచి ఒక వ్యక్తి తీసుకువస్తున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
‘ఈ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన జరిగే ఎన్నికలు నీతికి, ఇచ్చిన మాటకు పేద ప్రజల సంక్షేమ మానికి పాటు పడే జగన్మోహన్ రెడ్డి, పిల్లనిచ్చిన మామ కి వెన్నుపోటు పోటు పోడిచి, అబద్దపు హమీలు ఇచ్చి అధికారం కోసం పాకులాడే చంద్రబాబు నాయుడు మధ్య జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో ప్రజల ఎవరు వైపు ఉంటరో తెల్చుకునే అవకాశం వచ్చింది,’ అని నాని అన్నారు.
ఆయన చంద్రబాబు నాయుడి మీద ఎలా విరుచుకుపడ్డారో చూడండి:

