Kodali Nani: వైసీపీ మాజీమంత్రి కొడాలి నాని అరెస్టు కాబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈయనపై ఏపీలో పలు కేసులు నమోదైన నేపథ్యంలో ఎప్పుడైనా ఏ క్షణమైన ఈయన అరెస్ట్ కావచ్చని తెలుస్తుంది. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఈయనపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేయడంతో ఎయిర్ పోర్టులో పెద్ద ఎత్తున ఈయన కోసం గాలింపులు కూడా జరుగుతున్నాయి అయితే తాజాగా కోల్ కత్తా ఎయిర్ పోర్ట్ లో కొడాలి నానిను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ వార్తలు వినిపించాయి.
ఈయన పైన లుక్ అవుట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో కోల్ కత్తా నుంచి కొలంబో వెళ్తున్నటువంటి నానిని పోలీసులు అరెస్టు చేశారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే ఈ వార్తలపై ఏపీ పోలీస్ శాఖ స్పందించింది కొడాలి నాని తాము కోల్ కత్తాలో అరెస్టు చేశామంటూ వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని మేము తనని అరెస్టు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఇలా నాని అరెస్టు గురించి పోలీసులు స్పందించినప్పటికీ అభిమానులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొడాలి నాని ఈ వార్తలపై స్పందించారు.
ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ తాను అరెస్ట్ అయ్యానంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని, ఇవన్నీ పూర్తిగా ఆ వాస్తవమేనని కొట్టి పారేశారు. అదేవిధంగా తాను ప్రస్తుతం హైదరాబాదులోని తన ఇంట్లోనే ఉన్నానని, ఎక్కడికి వెళ్లలేదని తెలియజేశారు. అదే విధంగా తన వద్ద డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డు తప్ప పాస్ పోర్ట్ వంటివి ఏమీ లేవని తాను విదేశాలకు పారిపోయే అవకాశాలు కూడా లేదు అంటూ కొడాలి నాని తన అరెస్టు గురించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఈయనపై ఏపీలో ఎన్నో కేసులు నమోదైన నేపథ్యంలో ఏ క్షణమైన నాని అరెస్టు కావడం తప్పదని తెలుస్తోంది. అయితే ఇటీవల ఈయనకు హార్ట్ సర్జరీ జరిగిందంటూ వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఈయన అరెస్టు కూడా వాయిదా పడుతుందని తెలుస్తుంది.