వచ్చే సాధారణ ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటి చేయాలా వద్దా అనే అంశం తన చేతుల్లో లేదని టిడిపి నేత, మండలి మాజీ డిప్యూటి చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ జీవితం కోసమే రాజకీయం చేశారు. రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డిలు ప్రజలకు అందుబాటులో ఉన్న విధంగా జగన్ ఉండటం లేదని సతీష్ రెడ్డి అన్నారు.
పులివెందులకు నీళ్లు తీసుకొచ్చాం, పెన్షన్లు అందరికి ఇస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి ప్రజల నుంచి వచ్చిన మనిషి. కానీ జగన్ పై నుంచి ఊడిపడినట్టు ప్రవర్తిస్తున్నారు. పులివెందులలో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని సతీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం చేసిన అభివృద్ది మీద, ప్రత్యేకించి పులివెందుల కోసం చేపట్టిన పథకాల మీద తెలుగుదేశం పార్టీ బహిరంగ చర్చకు సిద్దంగా ఉందని అంటూ దీనికి జగన్ సిద్ధమా అని ప్రశ్నించారు.
పులివెందుల సతీష్ రెడ్డితో తెలుగురాజ్యం ప్రతినిధి గణపతి చేసిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ఇది.
https://soundcloud.com/ganapathi-telugurajyam