తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ఇంటరెస్టింగ్ న్యూస్ !

janasena and bjp parties are changed their strategy in tirupati by elections

ఏపీలో ఇప్పుడు స్థానిక సంస్థల హడావిడి ఉన్నప్పటికీ పార్టీలన్నీ తిరుపతి ఉప ఎన్నిక మీదనే వ్యూహాలు తయారు చేస్తున్నారు. ఓవైపు వైసీపీ మరోవైపు టీడీపీ బలంగా ఆ సీటు కోసం వెంపర్లాడుతున్నాయి, ఈ కోవలోనే ఈ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ-జనసేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బీజేపీ-జనసేన వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఈ గెలుపు కోసం అహర్నిశలు పాటు పడుతోంది. ఉప ఎన్నిక వ్యూహంలో భాగంగా పార్టీలన్నీ కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొస్తున్నారు.

janasena and bjp parties are changed their strategy in tirupati by elections
janasena and bjp parties are changed their strategy in tirupati by elections

వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కుటుంబానికి కాకుండా కొత్త అభ్యర్థిని బరిలోకి దింపుతున్నాయి. గురుమూర్తిని దాదాపుగా ఖాయం చేశాయి. ఇక టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ ఇప్పటికే ఖరారయ్యారు. ఇప్పుడు ఇరుపార్టీలు ఇప్పుడు మరో కొత్త ఆప్షన్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సహజంగానే బీజేపీలో మేధావులు బ్యూరోక్రాట్లకు పెద్దపీట వేస్తారు. ఈ క్రమంలోనే బీజేపీతోపాటు జనసేన కూడా ఇప్పుడు ఓ కొత్త అభ్యర్థి విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

తిరుపతిలో జనసేన లేదా బీజేపీ ఎవరు పోటీచేసినా గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. బీజేపీ తరుఫున మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుతోపాటు బ్యూరోక్రాట్ దాసరి శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తోంది. వీరిద్దరిలో ఒకరికి పదవి ఖాయం అంటున్నారు. ఇక తాజాగా తిరుపతి ఉప ఎన్నిక కోసం బీజేపీ-జనసేన అభ్యర్థిగా కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ పేరు బలంగా వినిపిస్తోంది. ఏపీకి చెందిన ఈమె రిటైర్ మెంట్ తర్వాత బీజేపీలో చేరారు. ఈమె అయితేనే బెటర్ అని మిత్ర పార్టీలు బలంగా నమ్ముతున్నాయట, ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటించాల్సి ఉంది.