‘సైలెన్స్’ అనే కొత్త ఆయుధాన్ని వారిని వాళ్ళందరికీ ఫోన్ లు చేసి మరీ చెప్పిన జగన్ ?

స్వర్ణా ప్యాలెస్ యాక్సిడెంట్ కేసులో జగన్ అత్యవసర ఆదేశాలు .. అతిపెద్ద ఛేజింగ్ నడుస్తోంది.

అమరావతి: రాష్ట్రంలో రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా రాజధాని విషయంలో ఎలాంటి తీర్పు వస్తుందోనని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం కూడా తెలిసిందే. ఈ రెండు తీర్పుల కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూసున్నారు. ఈనెల 16న రాజధాని శంకుస్థాపన చేయాలన్న సంకల్పంతో రాజధాని అడ్డంకులను తొలగించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు.

Why YS Jagan's government went to Supreme court

ప్రభుత్వ నిర్ణయానికి హై కోర్టులో ఎదురుదెబ్బ తగిలిన ప్రతిసారి వైసీపీ నాయకులు టీడీపీ నాయకులను ఇష్టమొచ్చినట్టు తిట్టేవారు. వైసీపీ రంగుల విషయంలో, సుధాకర్ విషయంలో, ఈసీ రమేష్ విషయంలో, ఇంగ్లీష్ మీడియం విషయంలో ఇలా ప్రతిసారి అడ్డంకి వచ్చినప్పుడు టీడీపీ నాయకులను తిట్టడానికే ప్రెస్ మీట్స్ పెట్టేవారు. అయితే అమరావతి విషయంలో మాత్రం వైసీపీ నాయకులు చాలా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పటివరకు ఒక్క నాయకుడు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు.

అయితే అమరావతి విషయంలో సైలెంట్ గా ఉండటానికి సీఎం జగన్ నుండి వచ్చిన ఆదేశాలు అందుకు కారణమని తెలుస్తుంది. అమరావతిపై ఫైనల్ తీర్పు వచ్చే వరకు అందరు సైలెంట్ ఉండాలని ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి హెచ్చరికలు జారీ చేశారని సమాచారం. పార్టీ అధినేత అదేశాలను పాటిస్తూ వైసీపీ నాయకులు సంయమనం పాటిస్తున్నారు. సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. స్టేటస్ కోపై సుప్రీంకు వెళ్లాడాన్ని కొందరు న్యాయ పండితులు తప్పు పడుతున్నారు. రాజధానిపై జోక్యం చేసుకోలేమని కేంద్రం చెప్పడంతో ఆనందంలో ఉన్న వైసీపీ నేతలు ఇవాళ్టి సుప్రీం తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. రాజధానికి అడ్డంకులు తొలిగితే ప్రధాని మోడీని శంకుస్థాపనకు పిలవాలని జగన్ ప్రయత్నం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రేపటి తీర్పుతో అయినా వైసీపీ నాయకులు తమ మౌనాన్ని విడి మళ్లాడుతారో, జగన్ మళ్ళీ ఆదేశాలు జారీ చేసే వరకు సైలెంట్ అనే ఆయుధాన్ని వాడుతారో వేచి చూడాలి.