రాజకీయంలో అధికారం ఎవ్వరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరకు భజన బ్యాచ్ చేరుతుంది. ఈ భజన బ్యాచ్ వల్ల చాలా మంది రాజకీయ నాయకులు తమ నిజమైన పార్టీ నేతలను కోల్పోతున్నారు. ఈ భజన బ్యాచ్ తాకిడి వైసీపీకి కూడా తగిలిందని తెలుస్తుంది. 2014 ఎన్నికల తరువాత వైసీపీని తిడుతూ టీడీపీ దగ్గర ఉన్న నాయకులు, పక్కా జనసేన నాయకులు ఇప్పుడు వైసీపీ దగ్గరకు వస్తున్నారు. ఈ భజన బ్యాచ్ నాయకులు ఎప్పటి నుండి ఉన్న పార్టీ నేతలను తొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు కావలసిన పనులను చేయించుకుంటున్నారు. వైసీపీ ఎప్పటి నుండో ఉన్న నిజమైన నేతలకు కూడా వైసీపీ అధిష్టానంతో సంబంధం లేదు కానీ ఈ భజన బ్యాచ్ కు ఏకంగా అధిష్ఠానం పెద్దలతో మాట్లాడుతూ పనులు చేయించుకుంటూన్నారు.
వైసీపీ పార్టీ నేతలు ఈ నకిలీ నాయకుల పెత్తనంను జీర్ణించుకోలేకపోతున్నారు. తమను పట్టించుకోకుండా నకిలీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఎప్పటి నుండో ఉన్న నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నకిలీ నేతల తాకిడి ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ విషయం జగన్ దగ్గరికి కూడా వెళ్లిందంట. ఈ నకిలీ నాయకులకు పార్టీ నేతలు ప్రాధాన్యత ఇవ్వడంపై ముఖ్యమంత్రి జగన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ నేతలను వదిలి పార్టీని నమ్ముకొని ఉన్న నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ సూచించారని తెలుస్తుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి రోజు ఎదో ఒక సమస్యతో సతమతమవుతున్న తరుణంలో ఈ నకిలీ నాయకుల గొడవ ఏంటని జగన్ అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకున్న నేతలను పక్కన పెడితే రానున్న రోజుల్లో పార్టీకి మంచిది కాదని, నకిలీ నేతలను పక్కన పెట్టాలని రాజకీయ విశ్లేషకులు కూడా వైసీపీ నాయకులకు సూచనలు చేస్తున్నారు. అసలే కష్టాల్లో ఉన్న తమ పార్టీకి ఈ దొంగ నేతల తాకిడి పెరగడం తమ పార్టీ ఖర్మని, దీన్ని కట్టడి చేయాలని పార్టీ నేతలకు జగన్ తెలిపినట్టు తెలుస్తుంది.