సమైక్యాంధ్ర ఉద్యమంజోరుగా సాగుతున్న రోజులవి. టిడిపి పార్లమెంటుకు రాజీనామాచేయాలని కూడా డిమాండ్ వస్తున్నది.అయితే టిడిపి సభ్యులు మాత్రం రాజీనామా జోలికి వెళ్లకుండా దీక్షలు ప్రారంభించారు. అలాంటపుడు 2013 ఆగస్గు 22 ఆయన తన రాజ్యసభకు రాజీనామా చేశారు. ఎలాంటి జంకు లేకుండా నేరుగా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛెయిర్మన్ హమీద్ అన్సారీని కలుసుకుని రాజీనామా పత్రం సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్ విభజించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనికి తాను నిరసన వ్యక్తం చేస్తున్నానని, అందుకే ఈ పార్లమెంటులో ఉండలేనని ఆయన రాజీనామా చేశారు. ఆయన హామీద్ అన్సారీ ని కలుసుకుంటున్నపుడు రాజ్యసభ నడవలొ సుజనా చౌదరి, సిఎం రమేష్ విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. తాను రాజీనామ ా చేస్తున్న విషయం ఆయన తోటి సభ్యులకు గాని, పార్టీకి తెలియ చేయలేదు. సీమాంధ్ర లో సమైక్యాంధ్ర ఉద్యమం సాగుతున్నపుడు తాను ఇక్కడ రెండు నినాదాలు చేస్తూ సభలో కూర్చోలేనని ఆయన అభిప్రాయపడ్డారు. అంతే, రాజీనామా చేశారు. ఆయన ఎంతవేగంగా రాజీనామా చేశారో, అంతే వేగంగా రాజీనామాను ఛెయిర్మన్ ఆమోదించారు.
రాజీనామా చేస్తున్నపుడు తెలుగులోనే ఆవేశం విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రసంగించారు. అనువాదం లేదని చెప్పినా వినలేదు. ఉపన్యాసం చేసి బయటకు వెళ్లిపోయారు.
ఆయన రాజీనామా చేసిన విషయాన్ని సభలో డిప్యూటీ ఛెయిర్మన్ కురియన్ ప్రకటించే దాకా ఎవరికిీ తెలియదు. ఈ నిర్ణయంతో తెలుగుదేశం పార్టీకి కూడా షాక్ ఇచ్చారు.
ఆయన నిర్ణయాలన్నీ ఇలాగే ఉంటాయి. ఆయన తెలుగుదేశంలో ఉన్నా లేనట్టే ఉంటూవచ్చారు. పార్టీనేత చంద్రబాబుకు ఆయనకు గ్యాప్ వుండటమేదీనికి కారణమని చెబుతారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు కూడా ఆయనతో స్నేహం కొనసాగిస్తూ ఉంటారు.