ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక ఒక వైపు, ప్రచార కార్యక్రమాలు మరోవైపు మొదలుపెట్టాయి! ఇంకోపక్క హస్తిన కేంద్రంలో ఏపీలో పొత్తు రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సర్వే ఫలితాలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని 15 నియోజకవర్గాల్లో ప్రజల మూడ్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం…!
అవును… ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా… 2019లో వాటిలో 11 అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. నాలుగు సీట్లు టీడీపీ గెలుచుకుంది. ఈ క్రమంలో 2024లో టీడీపీ – జనసేన (కుదిరితే బీజేపీ) కలిసి పోటీ చేస్తున్న వేళ.. ఐదేళ్లు జగన్ పాలన చూసిన వేళ మినీ ఇండియా విశాఖ ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలున్నాయనే విషయాలపై ఒక సర్వే రిపోర్ట్ తెరపైకి వచ్చింది.
విశాఖ తూర్పు:
విశాఖ సిటీలోని నాలుగు ప్రధాన నియోజకవర్గాల్లో ఒకటైన తూర్పు నియోజకవర్గంలో టీడీపీ – జనసేన కూటమికి 53 శాతం ఓటు షేర్ ఉంటే వైసీపీకి 44.5 శాతంగా ఉందని తాజా సర్వే వెళ్లడించింది. అంటే… సుమారు 8.5 శాతం క్లియర్ లీడ్ తో టీడీపీ – జనసేన కూటమి దూసుకుపోతుంది!
విశాఖ పశ్చిమ:
విశాఖ పశ్చిమ నియోజకవర్గం విషయానికొస్తే… ఇక్కడ కూడా టీడీపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా టీడీపీ – జనసేన కూటమికి 52 శాతం ఓటు షేర్ ఉండగా… అధికార వైసీపీకి 44 శాతం ఓటు షేర్ దక్కే అవకాశం ఉందని అంటున్నారు. అంటే… ఇక్కడ కూడా టీడీపీ – జనసేన కూటమి 8 శాతం ఓట్ షేర్ తో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు.
విశాఖ ఉత్తరం:
విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికొస్తే… ఇక్కడ మాత్రం అధికార వైసీపీ తమ సత్తా చాటే అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగా… వైసీపీకి 50 శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉండగా.. టీడీపీకి 47 శాతం ఓటు షేర్ కనిపిస్తుంది. అంటే… ఈ నియోజకవర్గంలో టీడీపీ – జనసేన కూటమి మీద వైసీపీ 3 శాతం ఆధిక్యతతో ఉంది.
విశాఖ దక్షిణం:
విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ కానిస్టెన్సీ విషయానికొస్తే ఇక్కడ టీడీపీ – జనసేన కూటమి కంటే వైసీపీ స్వల్ప మెజారిటీలో ఉందని తెలుస్తుంది. ఇందులో భాగంగా… వైసీపీకి 48.75 శాతం ఓటు షేర్ ఉంటే.. టీడీపీ కూటమికి 47 శాతం ఓటు షేర్ ఉంది! అంటే… ఇక్కడ ఫైట్ హోరా హోరీగా సాగే అవకాశం ఉందని భావించొచ్చు!
పాడేరు:
పాడేరు (ఎస్టీ రిజర్వుడ్) నియోజకవర్గాన్ని పరిశీలిస్తే… ఇక్కడ అధికార వైసీపీకి 49 శాతం టీడీపీ – జనసేన కూటమికి 44 శాతం ఓటు షేర్ దక్కుతోందని ఈ సర్వే చెబుతుంది. అంటే… ఇక్కడ వైసీపీ 5 శాతం లీడ్ తో క్లియర్ ఆధిక్యతను కొనసాగిస్తోంది.
ఎలమంచిలి:
ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికొస్తే… ఇక్కడ కూడా హోరా హోరీ పోరు తప్పదనేలా ఉన్నాయి సర్వే ఫలితాలు. ఇందులో భాగంగా ఇక్కడ టీడీపీ – జనసేన కూటమికి 49 శాతం వైసీపీకి 47.5 శాతం ఓటు షేర్ దక్కుతుంది. అంటే… 1.5శాతం మాత్రమే వ్యత్యాసం ఉందన్న మాట. సో… హోరా హోరీ ఖాయమనే చెప్పాలి!!
పాయకరావుపేట:
పాయకరావుపేట (ఎస్సీ రిజర్వుడ్) నియోజకవర్గం విషయానికొస్తే… ఇక్కడ కూడా అధికార పార్టీ హవా కొనసాగించేలా కనిపిస్తుంది. ఇందులో భాగంగా.. వైసీపీకి 50 శాతం, టీడీపీ – జనసేన కూటమికి 46 శాతం ఓటు షేర్ దక్కేలా కనిపిస్తుంది. అంటే… సుమారు నాలుగు శాతం వైసీపీ ఆధిక్యతతో ఉంది.
నర్శీపట్నం:
నర్శీపట్నం నియోజకవర్గానికి వచ్చేసరికి టీడీపీ – జనసేన కూటమి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇందులో భాగంగా… టీడీపీ – జానసేన కూటమి 49.5 శాతం ఓట్ షేర్ కలిగి ఉండగా.. వైసీపీకి 46 శాతం ఓటు షేర్ ఉంది. అంటే… వైసీపీ మీద టీడీపీ కూటమి 3.5 శాతం ఓటు షేర్ ఆధిక్యంలో ఉంది.
చోడవరం:
చోడవరం అసెంబ్లీ సీటు విషయానికి వస్తే ఇక్కడ వైసీపీకి ఓటు షేర్ 49 శాతం టీడీపీ కూటమికి 48 శాతం ఉంది. అంటే… ఇక్కడ వైసీపీ 1 శాతం మాత్రమే లీడ్ తో ఉంది. సో… ఇక్కడ కూడా హోరా హోరీ పోరు తప్పేట్లు లేదనే అనుకోవాలి.
మాడుగుల:
ఇక, మాడుగుల నియోజకవర్గాన్ని చూస్తే ఇక్కడ టీడీపీ కూటమి స్పష్టమైన మెజారిటీతో ఉందని తెలుస్తుంది. ఇందులో భాగంగా… టీడీపీ – జనసేన కూటమి 50.5 శాతం వైసీపీ 45.5 శాతం ఓటు షేర్ తో ఉన్నాయి. అంటే… ఇక్కడ టీడీపీ కూటమి వైసీపీ మీద 5 శాతం స్పష్టమైన ఆధిక్యతతో కొనసాగుతోందన్న మాట.
అరకు:
అరకు అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో వైసీపీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇందులో భాగంగా… వైసీపీ 49.5 శాతం, టీడీపీ 45 శాతం ఓటు షేర్ తో ఉన్నాయి. అంటే… ఇక్కడ 4.5 శాతం లీడ్ తో వైసీపీ కొనసాగుతోంది.
భీమునిపట్నం:
భీమునిపట్నం నియోజకవర్గాన్ని పరిశీలిస్తే… టీడీపీ – జనసేన కూటమికి 51 శాతం, వైసీపీకి 46 శాతం ఓటు షేర్ దక్కే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా టీడీపీ – జనసేన కూటమి వైసీపీ మీద 5 శాతం స్పష్టమైన ఆధిక్యతతో కొనసాగుతోంది.
అనకాపల్లి:
అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికొస్తే… ఇక్కడ టీడీపీ కూటమి 49.5 శాతం, వైసీపీ 46.5 శాతం ఓటు షేర్ దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే… ఇక్కద 3 శాతం లీడింగ్ తో టీడీపీ – జనసేన కూటమి ఉంది.
పెందుర్తి:
పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికొస్తే… టీడీపీ – జనసేన కూటమికి 51 శాతం వైసీపీకి 46 శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంది. అంటే… ఇక్కడ 5 శాతం స్పష్టమైన ఆధిక్యతతో టీడీపీ – జనసేన కూటమి ఉంది.
గాజువాక:
ఇక, గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాకలో ఈసారి టీడీపీ – జనసేన కూటమి 49.5 శాతం వైసీపీ 46.5 శాతం ఓటు షేర్ తో ఉంది. అంటే… ఇక్కడ 3 శాతం ఓటు షేర్ తో టీడీపీ కూటమి ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి గాజువాకలో పవన్ పోటీచేస్తే గెలుపు పక్కా అన్నమాట.