జగన్ కేసీఆర్ మధ్య విభేదాలు.. ఆ ఒక్క వ్యక్తే కారణమా?

కేంద్రంలో అధికారంలో మోదీ సర్కార్ తో జగన్ సన్నిహితంగా మెలుగుతుంటే కేసీఆర్ మాత్రం కారాలు మిరియాలు నూరుతున్నారు. కేంద్రంపై విమర్శలు చేసే ఏ అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని వదులుకోవడానికి కేసీఆర్ ఇష్టపడటం లేదు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ ఏపీలో అధికారంలోకి రావడానికి కేసీఆర్ కూడా ఒక విధంగా కారణమని చాలామంది భావిస్తారు. కేసీఆర్ జగన్ కు ఆర్థికంగా తన వంతు సహాయం చేశారని సమాచారం.

అయితే ప్రస్తుతం జగన్ వ్యవహార శైలి కేసీఆర్ కు ఏ మాత్రం నచ్చడం లేదు. కొన్నిరోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ జగన్ సర్కార్ పై నెగిటివ్ కామెంట్లు చేయడం వెనుక అసలు రీజన్ ఇదేనని సమాచారం. కేసీఆర్, జగన్ రాబోయే రోజుల్లో కలిసి కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించినా ఆ పార్టీ విషయంలో జగన్ నుంచి నామమాత్రంగా కూడా స్పందన లేదనే సంగతి తెలిసిందే.

రాబోయే రోజుల్లో కూడా జగన్ బీ.ఆర్.ఎస్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని కూడా కూల్చబోతుందని కేసీఆర్ కామెంట్లు చేసినా ఆ కామెంట్లను ఎవరూ నమ్మడం లేదు. జగన్ సర్కార్ కు 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. జగన్ సర్కార్ ను కూల్చడం ఇతర పార్టీలకు తేలికైన విషయం కాదనే సంగతి తెలిసిందే.

అయినప్పటికీ కేసీఆర్ మాత్రం బీజేపీపై ఇతర పార్టీలకు అనుమానం కలిగించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ప్రయత్నంలో కేసీఆర్ సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది. కేసీఆర్ సర్కార్ మునుగోడు ఎన్నికల్లో గెలుస్తుందని సర్వేలు చెబుతుండగా ఆ ఫలితాలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది.