కాంగ్రెసుకు మెగా షాక్ : పార్టీకి చిరంజీవి రాజీనామా?

మేము సైతం అంటూ మెగా స్ఫూర్తితో ల‌ఘుచిత్రం

(యనమల నాగిరెడ్డి)

సినిమాలలో తనదైన శైలిలో నటించి అశేష ప్రేక్షకులను అలరించి, అభిమానులుగా మార్చుకుని తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలను మెప్పించిన ఘనుడు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు దేశం పార్టీని స్థాపించి, విశేష జనాధరణతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి, దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసిన ఘనాపాటీ ఎన్టీఆర్.

ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకున్న చిరంజీవి, తనకు కులం అదనపు బలమౌతుందనే అంచనాలతో సామాజిక న్యాయం నినాదంతో ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించి 2009 ఎన్నికలలో పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో ఆయన 18 మందిని గెలిపించడంతో పాటు సుమారు16శాతం ఓట్లు సాధించారు.అయితే, ఆశించినట్లు నాటి టిడిపి లాగా ప్రజారాజ్యం అధికారంలోకి రాలేకపోయింది.చిరంజీవికి  ముఖ్యమంత్రి పీఠం దక్కకుండా పోయింది. తర్వాత ప్రజారాజ్యం నుంచి ఒక్కొక్కరే కాంగ్రెస్ వైపు వెళ్లడం మొదలయింది. ఊహించని ఈ   రాజకీయ పరిణామం  చోటుచేసుకోవడంతో ఆయన ‘ప్రజారాజ్యం’ పార్టీని కాపాడుకుంటాడా అని ప్రశ్న ఎదురయింది. దీనికి విరుగుడు కనిపెట్టారు. పార్టీని  కాంగ్రెసు లో విలీనం చేసి కేంద్రమంత్రివర్గంలో చేరిపోయారు. అలాగే ఇద్దరు  సహచరులకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించగలిగారు.

 

అప్పటి నుంచి రాష్ట్రవిభజన వరకు  కాంగ్రెస్ లోనే ఉన్నారు. అయితే, ఆయనెపుడూ  రాజకీయనాయకుడిగా కన్వర్ట్ కాలేకపోయారు. ఏదో అపుడుపుడు కాంగ్రెస్ సమావేశాలకు హాజరయిన గ్లామర్ తీసుకువస్తూ వచ్చారు. ఆయన  చురుకుగా ఉన్నది విభజన సమయంలోనే. విభజనను ఆయన వ్యతిరేకించారు.  అయితే సినిమా రంగంలో రారాజుగా ఉన్న చిరంజీవికి రాజకీయాలలో రెండవ హీరో పాత్ర పోషించాల్సి వచ్చింది. అది ఆయనకు ఎంతమాత్రం రుచించలేదు.

రాజకీయ నాయకుల నటన ముందు తానేందుకు పనికిరాననే నిర్ధారణకు వచ్చిన చిరంజీవి రాష్ట్రవిభజన తర్వాత  అజ్ఞాతంలో కివెళ్లిపోయారు. సినిమాల్లో తలమునకలయిపోయారు. దీనిఫలితమే ఖైదీ నెంబర్ 150. బాగా లాభాలు తెచ్చినపెట్టిందీ సినిమా.

రాష్ట్రవిభజన వల్ల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో జీవశ్చవంలా మిగిలిన కాంగ్రెసుకు జవసత్వాలు కల్పించడం కోసం పార్టీ పగ్గాలు చేపట్టాలన్న అధిష్టానం సూచనను ఆయన అంగీకరించలేదని చెబుతారు. తెలంగాణాలో పార్టీ ప్రచార భాద్యతలు చేపట్టాలన్న అధిష్టానం సూచనను కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు.  సినిమాల్లోనే కొనసాగుతున్నారు. ఇపుడాయన సైరా నరసింహారెడ్డి సినిమాలో బిజీగా ఉన్నారు. 

2014లో ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించారు. మొదట్లో కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకించి టీడీపీ, బీజేపీల పొత్తుకు మద్దతు పలకారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపధ్యంలో పవన్ స్వంతంగా రాజకీయాలు చేయాలని నిర్ణయించి యాత్రలు చేపట్టారు.
ఇదే సమయంలో కాంగ్రెసు టీడీపీతో జతకట్టి దక్షణ భారత రాజకీయాలపై చంద్రబాబుకు పెత్తనం అప్పగించడం జరిగిందనే ప్రచారం తీవ్రంగా ఉంది.

 

ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులతో సమానంగా తాను ప్రజాజీవితంలో నటించలేననే నిర్ణయానికి ఆయన వచ్చారు. నైతిక విలువలకు తిలోదాకాలిచ్చి టీడీపీ కాంగ్రెసు జతకట్టడం ఆయనకు జీర్ణం కావడంలేదని సమాచారం. ఇకపోతే తమ్ముడు పవన్ పార్టీ టీడీపీ, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించి, ప్రస్తుతం టీడీపీ, కాంగ్రెసు పొత్తుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెసు కు మద్దతుగా నిలిస్తే కుటుంభపరమైన విభేదాలు తలెత్తగలవన్న ఆందోళన కూడా ఆయనలో నెలకొనింది.
అందువల్ల తనకు నచ్చని పని చేయడం, నామకార్థం రాజకీయాలలో కొనసాగడం ఇష్టం లేకపోవడం లాంటి కారణాలవల్ల
చిరంజీవి కాంగ్రెసు కు రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చారని సమాచారం. మరో రెండు మూడు రోజులలో ఆయన ఈమేరకు ప్రకటన చేస్తారని తెలుస్తున్నది.

ఆ తర్వాత ఆయన రాజకీయాలలో కొనసాగి జనసేనకు, మద్దతిస్తారా లేక వైస్సార్ పార్టీ లో చేరగలరా లేక రాజకీయాలకు శాశ్వతంగా దూరమౌతారా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.