కర్నాకటలో బిజెపికి ఇలా మరొక దెబ్బ తగిలింది

కర్నాటకలో బిజెపికి దిమ్మదిరిగేలా దెబ్బ వేశాడు పార్టీ అభ్యర్థి చంద్రశేఖర.

అతగాడు రామనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి. పోలింగ్ నవంబర్ మూడో తేదీన.

నేను ఎన్నికల్లో లేనని, బిజెపి నుంచి వెనక్కొస్తున్నానని ఈ రోజు ప్రకటించి భారతీయ జనతా పార్టీకి కంపరం పుట్టించాడు.

అంతేకాదు,  ప్రత్యర్థి, జెడిఎస్- కాంగ్రెస్ క్యాండిడేట్  అనితకు మద్దతు అని కూడా ప్రకటించాడు.

ఎల్ చంద్రశేఖర, పోలింగ్ ముందు పోటీ నుంచి ఉపసంహరించుకున్న బిజెపి అభ్యర్థి

అనిత ముఖ్యమంత్రి కుమార స్వామి భార్య.  ఇపుడామె గెలుపు గ్యారంటీ అయింది. ఎందుకంటే, ఇక రంగంలో మిగిలింది నలుగురైదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులే.

 పోలింగ్ రెండురోజుల్లో ఉన్నపుడు తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ఈ రోజు బెంగూళూరలో  చంద్రశేఖర ప్రకటించి సంచలనం సృష్టించారు.

దీనికి కారణం చెబుతూ, పోటీ చేయించి తనని  బిజెపి గాలికి వదిలేసిందని,  ఒక్క నాయకుడు కూడా తన తరఫున క్యాంపెయిన్ చేయడం లేదని, తనని ఎన్నికల బలిపశువు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధపడ్డారు. అందుకే ఇలా అర్దాంతరంగా పోటీ నుంచి విరమించుకుంుటున్నాని చెప్పారు.

ఇలాంటి పార్టీలో ఉండటం కంటే బయటకొచ్చి కాంగ్రెస్-జెడి (ఎస్ )అభ్యర్థికి మద్దు తీయడం మేలని చెప్పాడు. తాను మళ్లీ త్వరలో కాంగ్రెస్ లో చేరతానని కూడా ప్రకటించారు.

నవంబర్ మూడో తేదీన బళ్లారి, మాండ్యా, శివమొగ్గ  లోక్ సభ స్థానాలతో పాటు, రామనగర్, జామఖండి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.