బిగ్ అలర్ట్… బీసీలకు కచ్చితంగా తెలియాల్సిన విషయం ఇది!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ తొలి విడత జాబితానూ, జనసేన ఫైనల్ లిస్ట్ నూ ప్రకటించారు చంద్రబాబు! ఇందులో భాగంగా 118లోనూ 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. 175లోనూ 24స్థానాలు జనసేనకు విదిలించారు! ఆ సంగతి అలా ఉంటే… అభ్యర్థుల ఎంపిక విషయంలో బీసీలపై బాబు చూపించిన సవతి తల్లి ప్రేమ, చిన్నచూపు దోరణి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుందని తెలుస్తుంది.

వాస్తవానికి బీసీలంటే బాబుకు ముందునంచీ చిన్నచూపే అనే వాదన బలంగా ఉంది. ఓట్లకోసం బీసీ జపం.. సీట్లు మాత్రం అగ్రవర్ణాలు అని చెప్పబడే సామాజికవర్గాలకు కట్టబెడతారని అంటారు. బాబు ప్రతీసారీ ఇలానే చేస్తూ వచ్చారు. కట్ చేస్తే… ఇప్పుడు జగన్ జమానా నడుస్తుంది. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ ఆయా వర్గాలను జగన్ రోజు రోజుకీ దగ్గర చేసుకుంటున్నారు. అలా అని ఇవి ఎన్నికలు సమీపిస్తున్న వేళ చెబుతున్న మాటలు మాత్రమే కాదు.

ఇప్పటికే మున్సిపాలిటీ స్థాయి నుంచి.. కేబినెట్ స్థాయి వరకూ.. ఉపముఖ్యమంత్రుల లెక్కలతో పాటు రాజ్యసభ సభ్యుల విషయంలోనూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై తనకున్న కమిట్ మెంట్ ని చేతల్లోనూ చూపించారు. అందువల్ల… ఆ విషయంలో జగన్ క్రెడిబిలిటీని సంకించలేని పరిస్థితి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే… ఇప్పుడు కూడా చంద్రబాబు మారలేదు. బీసీలపై తనకున్న నైజాన్ని ఈసారి కూడా మార్చుకోలేదు. దీంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

తాజాగా చంద్రబాబు 94 మంది అభ్యర్థులను ప్రకటించిన లెక్కలు చూస్తే బీసీలపై ఆయనకున్న నిర్లక్ష్యానికి, చిన్నచూపుని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఇంద్లో భాగంగా… తాజాగా ప్రకటించిన 94 సీట్లలోనూ 4 శాతం ఉన్న కమ్మ సామాజికవర్గానికి 21 సీట్లు కేటాయించిన చంద్రబాబు… 45 శాతానికి పైగా ఉన్న బీసీలకు 18 సీట్లు మాత్రమే కేటాయించారు. ఈ ఒక్క గణాంకాలు చాలు.. బీసీలపై టీడీపీకి, చంద్రబాబుకి ఉన్న ప్రేమను తెలుసుకోవడానికి అని అంటున్నారు పరిశీలకులు.

ఈ క్రమంలో చాలా చోట్ల బీసీల సీట్లలో ఓసీ అభ్యర్థులను ప్రకటించిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఓట్లు మాత్రం బీసీలవి కావలని, టీడీపీ అంటే బీసీల పార్టీ అని పైకి కబుర్లు చెప్పే చంద్రబాబు… ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు, రాజ్యసభ సీట్లు మాత్రం డబ్బున్నవారు, కార్పొరేట్ నాయకులు, పెత్తందారులకు మాత్రమే ఇస్తారనే విషయం మరోసారి నిరూపణ అయ్యిందని చెబుతున్నారు. ఈ సమయంలో నందమూరి తారకరామారావు అప్పట్లో చేసిన పనులను తలచుకుంటున్నారు.

వాస్తవానికి టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ హయాంలో బీసీలకే ఆయన ఎపుడూ పెద్ద పీట వేసేవారు! ఆయన టీడీపీ అధినేతగా ఉండగా ఎంతో మంది బీసీలు, ఎసీల నాయకులకు, పెద్దగా డబ్బు ఖర్చు పెట్టలేని పేదవారికి సైతం చట్టసభలకు ఎన్నిక అయ్యే అవకాశాలు కల్పించరు. దీంతో ఎన్టీయార్ నాయకత్వంలో టీడీపీ బీసీల పార్టీగా ముద్రపడింది! చంద్రబాబు నాయకత్వంలోకి టీడీపీ వచ్చాక బీసీలను క్రమంగా పక్కకు పెట్టి కార్పోరేట్ వర్గాలు పెత్తందారీ శక్తులను తెరపైకి తీసుకుని రావడం మొదలైంది!

ఈ క్రమంలో మరోసారి చంద్రబాబు తన సహజ నైజాన్ని బయటపెట్టారనే చర్చ తెరపైకి వచ్చింది. బీసీలకు రాజకీయ అవకాశాలు బాగా తగ్గించి వారిని కేవలం ఓటు బ్యాంక్ గానే వాడుకోవాలన్నది టీడీపీ నయా విధానంగా మారిపోయింది అని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు 2024 ఎన్నికల కోసం విడుదల చేసిన 94 మంది అభ్యర్ధుల జాబితా చూస్తే.. బీసీలను పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగానే ఉంది అని అంటున్నారు. ఈ విషయాన్ని ఏపీలోని బీసీలంతా గమనించాలని ఈ సందర్భంగా ఆ సామాజికవర్గాల్లోని పెద్దలు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు!