విభజన హామీల అమలు కాంగ్రెస్‌తోనే సాధ్యం: కిరణ్

బిజెపి ప్రభుత్వం విభజన హామీలను అమలు పరుచడంలో విఫలమైందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. గత ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఇప్పటి ప్రధానిపై ఉందని, కాంగ్రెస్ ఏ పని చెప్పినా తాను చేసేందుకు సిద్దమేనని ప్రకటించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే విభజన హామీలు అమలవుతాయన్నారు. రాహుల్ ప్రధాని అయితే తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ది సాధ్యం అని, ఆ దిశగా అంతా కలిసి పనిచేయాలన్నారు. పార్లమెంటులో ప్రధాని చెప్పిన మాట చట్టంతో సమానమని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.