టిఆర్ఎస్ పార్టీ యువ అధ్యక్షుడు కేటీఆర్ కూడా, ఆయన తండ్రి కేసీఆర్ లాగే మంచి మాటకారి. నేటి రాజకీయాల్లో తనదైన శైలిని కనబరుస్తూ అప్పుడప్పుడు వ్యంగ్యపు మాటలతో నవ్విస్తూ దూసుకుపోతుంటాడు. ఇక కేటీఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు. తమ ప్రభుత్వం విధానాలకి సంబధించిన వీడియోలను పోస్టులను ట్వీట్ చేస్తూ.. ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కొన్ని సార్లు ఫన్నీ పోస్టులు కూడా పెట్టి తనలోనూ ఓ హాస్య చతురత ఉందని చెబుతుంటాడు. తాజాగా కేటీఆర్ పెట్టిన ఒక పోస్ట్ బాగా వైరల్ గా మారిపోయింది.
ఈ నెలాఖరులో లాగ్ డౌన్ ఎత్తివేస్తూ ఉండటం కారణంగా ఆ తర్వాత అందరి కార్యకలాపాలు ఇలా ఉండొచ్చు అంటూ కేటీఆర్ ఊహ జనకంగా ఉహించి ట్విట్టర్లో మెసేజ్ ను పోస్ట్ చేశారు. ‘ఇక్కడ ఎవరు సజీవంగా బయటపడే పరిస్థితి లేనందున మరో ఆలోచన చేయండి.. ఇప్పుడే మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి.. రుచికరమైన ఆహారాన్ని తినండి .. సూర్యరశ్మి ఆస్వాదిస్తూ హాయిగా నడక ప్రారంభించండి. సముద్రంలో దూకండి.. హృదయాన్ని ఒక పెన్నిధి పొదిలి పట్టుకు తిరుగుతున్నామన్న సత్యాన్ని అందరికీ చాటి చెప్పండి. అప్పుడప్పుడు సిల్లీగా ఉండండి. కొంచెం దయతో వ్యవహరించండి. మరికొంచెం విచిత్రంగానూ ఉండండి. ఇంకేదీ వదిలి పెట్టేందుకు సమయం లేదు. అన్ని ఇప్పుడే చేసేయండి’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.