రేవంత్ కి కరోనా  కలిసొచ్చే  అంశమే ! 

తెలంగాణలో కరోనా మహమ్మరి పంజా దెబ్బకు రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరిగడం.. మరో పక్క కేసీఆర్ ప్రభుత్వం చేతులెత్తేసిందని అభిప్రాయం వ్యక్తమవ్వడం, ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నా.. కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు కాలు పెట్టకపోవడం, నగరవాసులు భయాందోళనలను ఎవ్వరూ పట్టించుకోకపోవడం మొత్తంగా కేసీఆర్ పై కరోనా కాలంలో వ్యతిరేకత బాగా పెరిగిన మాట వాస్తవం. అయినా సీఎంగా కేసీఆర్ చేసింది ఏమి లేకపోవడంతో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ కేసీఆర్ చేతగాని తనాన్ని ప్రజలు ధ్వజమెత్తి చాటి చెప్పేలోగా, కేసీఆర్ మారితే అది ఆయనకే మంచింది. అసలు కరోనా సమయంలో ప్రజలకు భరోసా కల్పించాల్సిన సీఎం సైలైంట్ గా సైడ్ అయిపోవడం ఏమిటి ? ఇటీవల ప్రగతిభవన్ లో 30మందికి కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయంటే ఇక్కడ కరోనా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వేరే చెప్పాలా ? ఓ వైపు సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ ఎక్కడా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం నుండి కేసీఆర్ నుండి గాని ఎటువంటి క్లారిటీ లేకపోవడం పలు అనుమానాలు తావిస్తోంది.

నిజానికి కేసీఆర్ బయట కన్పించకపోవడంతో రేవంత్ రెడ్డికి మంచి ఛాన్స్ దొరికినట్లయింది. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే వాదనను ఎంపీ రేవంత్ రెడ్డి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పనిలో పనిగా సీఎం ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తొలి నుంచి కేసీఆర్ కు పక్కలో బల్లెంగా మారిన రేవంత్ రెడ్డికి మొత్తానికి చాన్నాళ్ళకి కరోనా అంశం కలిసొచ్చేలా కన్పిస్తుంది. మరి చూద్దాం రేవంత్ కరోనాను ఎలా ఉపగోగించుకుంటాడో