తెలంగాణ దేవుడు వీరుడు సూరుడు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జనంలోకి గానీ వస్తే.. ఆయన పై దాడి చేసేలా ఉన్నారు హైదరాబాద్ జనం. దాడికి కారణం కరోనా.. కేసులు పెరుగుతున్నా కేసీఆర్ ఏదీ తొందరగా తేల్చడం లేదు. కరోనా లాక్ డౌన్ తో రాష్ట్ర ఆదాయంతో పాటు తన రాజకీయమే బంద్ అయిపోయిందని కేసీఆర్ కరోనాని వెలివేశారు. కరోనా భయంతో భాగ్యనగరం భయాల మధ్య వైరస్ గుప్పిట్లో ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే..కేసీఆర్ మాత్రం పట్టించుకోవట్లేదు. నిజానికి రెండోసారి గద్దెనెక్కకా.. సీఎంగా కేసీఆర్ స్లో అండ్ స్టడీగా ముందుకు సాగుతూ జనం బాధలను పట్టించుకోవట్లేదు.
కొన్ని రోజులుగా రోజురోజుకు కరోనా కేసులు పెరగడం.. చూస్తుంటే తెలంగాణలో పరిస్థితి దిగజారుతున్నట్టు భావించక తప్పదు. అయినా కేసీఆర్ హరితహారం అంటూ సరదాగా గడిపేస్తున్నారు. రోగం ఉన్నోళ్లకు కరోనా వస్తే వారి ఏడుపు పగవాడికి కూడా వద్దు అని అందరూ బాధ పడుతుంటే… కేసీఆర్ అప్రతిహతంగా తన పాలనను సాగిస్తూ కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాడు. హైదరాబద్ లో పాతబస్తీతో ఇతర ప్రాంతాలకు వైరస్ విస్తరిస్తుండడంతో అందరూ ఆందోళనకు గురవుతున్నా… కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉంటున్నాడు.
కరోనా మొదలైనప్పటి నుంచి వరుసగా విలేకరుల సమావేశాలు నిర్వహించిన కేసీఆర్ కు చివరికి కరోనా అంటేనే గుర్తు లేకుండా పోయిందా అనిపిస్తోంది. ఎలాగూ ప్రతిపక్షం అనేది లేకుండా చేశాడు. తెలంగాణలో కరోనా వైరస్ టెస్టులు చేయడం లేదని హైకోర్టులు, జాతీయ మీడియా కూడా వేలెత్తి చూపుతున్నా టెస్ట్ లను పెంచకుండా జొధ్యం చూస్తున్న వ్యక్తి కేసీఆర్. ఒక్కటి మాత్రం నిజం… కరోనా వైరస్ మహమ్మారిని హ్యాండిల్ చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్యూర్ పూర్తిగా కనిపిస్తోంది.