ఇంతకీ ఎవరీ పరిపూర్ణానంద స్వామి?

పరిపూర్ణానంద స్వామి ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు. సినీ విమర్శకుడు కత్తి మహేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ఆయన హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్ర నిర్వహించాలనుకున్నారు. దాంతో పరిపూర్ణానందస్వామి యాత్ర నిర్వహిస్తే మత ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు అతనిని హౌజ్ అరెస్టు చేశారు. దాంతో పాటుగా పలు సందర్భాల్లో స్వామి పరిపూర్ణానంద చేసిన వ్యాఖ్యల ఆధారంగా పోలీసులు  ఆరు నెలల పాటు ఆయనను హైదరాబాద్ నుంచి నగర బహిష్కరణ చేశారు. బిజెపి నేతలు పరిపూర్ణానందకు మద్దతు పలికి, పలు అంశాలపై చర్చించారు. స్వామి రాజకీయాల్లోకి వస్తానంటే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కేటాయిస్తామని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తెలుగురాష్ట్రాల్లో పరిపూర్ణానందస్వామి హాట్ టాపిక్ అయ్యారు. దీంతో అంతా పరిపూర్ణానంద స్వామి గురించే చర్చించుకుంటున్నారు. అసలు ఇంతకు ఎవరీ పరిపూర్ణానంద స్వామి…?

శ్రీ పరిపూర్ణానంద సరస్వతి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో శ్రీమతి మీనాక్షి, బాలచంద్రన్ దంపతులకు 01 నవంబర్ 1972న జన్మించారు. ఆ తర్వాత తన నాలుగేళ్ల ప్రాయంలో ప్రాథమిక వేద విద్య కోసం వేద పాఠాశాలలో చేరాడు. ఆ తర్వాత కృష్ణ యజుర్వేదం నేర్చుకునేందుకు జాయిన్ అయ్యారు. అక్కడ అతనికి సంతృప్తి నివ్వక పోవడంతో బయటికి వచ్చేశారు. అలా దేశవ్యాప్తంగా ఉన్న ఆశ్రమాలనింటిని తిరుగుతూ తను చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అలా ఆశ్రమాలన్నింటిని తిరుగుతున్నప్పుడే స్వామి దయానంద సరస్వతిని హృషికేషిలో కలుసుకున్నారు స్వామి పరిపూర్ణానందా. అలా ఆయన ఆధ్వర్యంలో వేదాంతాలు నేర్చుకునేందుకు ఆయన శిష్యునిగా ఆయన వద్ద చేరారు స్వామి పరిపూర్ణానందా. అలా తన కోర్పు ముగిసిన తర్వాత 1990లో ఆయన దయానంద సరస్వతి ఆధ్వర్యంలో స్వామి పరిపూర్ణానంద బ్రహ్మచర్యం తీసుకున్నారు.

ఆ తర్వాత ఆయన 1995లో విశాఖకు చేరుకొని గీతాజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహాంచారు. అలా 32 గీతాజ్ఞాన కార్యక్రమాలు నిర్వహించారు. ఓ వైపు కార్యక్రమాలు  నిర్వహిస్తూనే పలు సామాజికి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అలా చేస్తున్నప్పుడే స్వామి మదిలోనుంచి  ఓ ఆలోచన వచ్చింది. ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందేలా ఓ వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక నుంచి కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నాడు. అదే శ్రీ పీఠం…. అలా 1998లో స్వామికి ఆలోచన వచ్చింది. మొత్తానికి 1999 ఫిబ్రవరిలో శ్రీ పీఠానికి రథ సప్తమి రోజున తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో స్వామి శంకుస్థాపన చేశారు.

 

ఆ తర్వాత స్వామి దయానంద సరస్వతి స్పూర్తితో 2000 సంవత్సరంలో స్వామి పరిపూర్ణానంద సన్యాసం స్వీకరించారు. ఆ తర్వాత పరిపూర్ణానంద భక్తి భావాలను పెంచుతూ ఆధ్యాత్మిక యాత్రలు చేపడుతూ ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాడు. ఆయన స్థాపించిన శ్రీపీఠంలో అనేక అర్ధాలను స్వామి సూచించాడు. శ్రీ… అంటే  జ్ఞానం, విద్య అంటూ చాలా అర్ధాలను చెప్పాడు. మే,2001లో శ్రీపీఠం పూర్తయ్యింది. దీనిని స్వామి గురువైన దయానంద సరస్వతి ప్రారంభించారు. సుబ్రమణ్య స్వామి, శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ ఐశ్వర్య సాహిత సుందరేశ్వర స్వామి వారి విగ్రహాలను ఏర్పరిచి పూజా కార్యక్రమాలతో ఈ శ్రీపాదంను ప్రారంభించారు.

శ్రీపాదం కాకినాడ నుంచి పిఠాపురం రోడ్డులో కాకినాడ రైల్వేస్టేషన్ కు ఐదుకిలోమీటర్ల దూరంలో, సామర్ల కోట రైల్వేస్టేషన్ కు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మూడు ఎకరాల విస్తిర్ణంలో  ఈ శ్రీపీఠంను ఏర్పాటు చేశారు. దీని కేంద్రంగా స్వామి అనేక భక్తి కార్యక్రమాలు, ,సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  వేలాది మంది భక్తులు నిత్యం పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆహ్లదకరమైన వాతావరణంలో శ్రీపీఠం ఉంటుంది.

స్వామి పరిపూర్ణానంద  సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయటమే లక్ష్యంగా తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. తన ఆలోచనలతో అనేక మార్పులకు శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామి శ్రీకారం చుడుతున్నారు.