ఎన్టీఆర్ బయోపిక్ లో రాజశేఖర్ రెడ్డి

అవును మీరు చదువుతున్నది నిజమే. . ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పాత్ర వుంది . నారా చంద్ర బాబు నాయుడు , డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు స్నేహితులు . ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు .  చంద్ర బాబు నాయుడు 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు . అప్పటి కాంగ్రెస్ పార్టీలో అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య , సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు .

రాజశేఖర్ రెడ్డి కూడా 1978లోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు . పులివెందుల నుంచి శాసనసభ కు ఎన్నికయ్యారు . గ్రామీణాభివృద్ధి మంత్రిగా అంజయ్య కాబినెట్ లో పనిచేశారు . అప్పుడు రాజశేఖర్ రెడ్డి , చంద్ర బాబు నాయుడు ఇద్దరు మంచి స్నేహితులు . ఒకేసారి రాజకీయాల్లోని వచ్చి మంత్రి పదవులను చేపట్టారు .

అంజయ్య ను ముఖ్యమంత్రిగా మార్చి  భవనం  వెంకట్రామ్ రెడ్డి ని నియమించారు . 1982 ఫిబ్రవరి లో  రాజభవనంలో పదవి ప్రమాణ స్వీకారం జరిగింది . అప్పటి గవర్నర్ కేసి  అబ్రహం వెంకట్రామ్ రెడ్డి తో ప్రమాణ స్వీకారం చేయించాడు . ఈ ప్రమాణ స్వీకారానికి చంద్ర బాబు తో పాటు రాజశేఖర్ రెడ్డి కూడా హాజరయ్యారు .

ఎన్టీఆర్ బయోపిక్ లో ఈ ఘట్టాన్ని డైరెక్టర్ క్రిష్  చిత్రీకరించాడు . భవనం పాత్రను నాజర్ ధరించగా చంద్ర బాబు పాత్రను రానా , రాజశేఖర్ పాత్రను హిందీ నటుడు ధరించాడు. ఇక ఈ ప్రమాణ స్వీకార సభకు నాదెండ్ల  భాస్కర రావు  అప్పటి కథానాయకుడు ఎన్టీ  రామారావు ను ప్రత్యేకంగా  ఆహ్వానించాడు .

సినిమాలో ఈ సన్నివేశం ఎంతో కీలకమైనది . ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రానికి ఇదే ప్రేరణ అంటారు .  ఈ మధ్యనే సికింద్రాబాద్ లీ ప్యాలస్ లో ఈ సీన్ తీసినట్టు తెలిసింది .