లిప్ లాక్ తో రచ్చ చేస్తున్న ‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్

లిప్ లాక్ తో రచ్చ చేస్తున్న ‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్

ఈ నెల 26న రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌. మూడు నిమిషాల ట్రైలర్‌లో సినిమా కథ అంతా చెప్పేసి సినిమా పై ఇంట్రస్ట్ పెంచేసారు. యాక్షన్ ఎమోషన్‌తో పాటు విజయ్‌ మార్క్‌ లిప్‌లాక్స్‌తో కూడా ట్రైలర్‌ను కట్‌ చేయటంతో యూత్ కు మరింతగా ఈ సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. అర్జున్ రెడ్డి కు బాప్ లా ఉందీ ట్రైలర్ అనే ప్రశంసలు వినపడుతున్నాయి.

విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భరత్ కమ్మ దర్శకుడుగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్ అనేది ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. శృతి రామచంద్రన్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈసినిమాకు జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతమందిస్తున్నారు.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుజిత్ సరంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి జైకృష్ణ మాటలు రాస్తున్నారు.

రామాంజనేయులు ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: భరత్ కమ్మ, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, కెమెరామెన్: సుజిత్ సరంగ్, ఎడిటర్: శ్రీజిత్ సరంగ్, డైలాగ్స్: జైకుమార్, బ్యానర్స్: మైత్రి మూవీమేకర్, బిగ్‌బెన్ సినిమాస్ నిర్మాతలు: నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చిరుకూరి (సి.వి.ఎం), యస్.రంగినేని.