ఎన్టీఆర్ ను వెతికే పనిలో బిజీగా రామ్ చరణ్ ?

అవును! ప్రస్తుతం ఎన్టీఆర్ వెతకటానికి రామ్ చరణ్ రాత్రింబవళ్లూ కష్టపడుతున్నారు. అదేంటి ఎన్టీఆర్ ఎక్కడికెళ్లారు. వెళ్లినా రామ్ చరణ్ వెతకటం ఏమిటి అంటారా…ఇదంతా ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలోని సీన్. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం యొక్క సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది.

ఈ షెడ్యూల్ లో భాగంగా ఇక ఎన్టీఆర్ ని రకరకాల మారు వేషాలు వేసి రామ్ చరణ్ పట్టుకునే పనిలో ఉంటారు. అయితే ఎన్టీఆర్ ఇంకా తెలివైన వాడు. రామ్ చరణ్ కు మించిన ఎత్తుకు పై ఎెత్తులు వేస్తాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రైబల్ తెగకు చెందిన వాడు కాగా ఆయనను పట్టుకొనే పనిలో చరణ్ బ్రిటీష్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారని తెలుస్తోంది.

అలాగే ఈచిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారని త్వరలోనే వారి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా బుర్రా సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు.

 ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ కోసం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ టెలివిజన్ నెట్ వర్క్ జీ టీవీ ఈచిత్రం యొక్క హిందీ ,తెలుగు , తమిళం శాటిలైట్ రైట్స్ కోసం సుమారు 150కోట్లు కోట్ చేసిందని టాక్. అయితే దానయ్య మాత్రం ఈ ఆఫర్ ను ఓకే చెయ్యకుండా రెండు వందల కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారట.