టాలీవుడ్ టాప్ స్టార్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం శ్రీరెడ్డికి తొలి నుంచి ఉన్న అలవాటే. అందులో కొన్ని కొన్ని సార్లు అర్ధంలేని ఆరోపణలతోనూ మీడియా అటెన్షన్ డ్రా చేసే ప్రయత్నం చేసింది. ఇక టాలీవుడ్ లో టెపోటిజం ఎప్పటి నుంచో ఉందని..ఇక్కడ నడిపించేది…బ్రతికించేది అదేనని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. తాజాగా బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు నెపొటిజం కూడా ఓ కారణం అంటూ బాలీవుడ్ మీడియా కథనాలు వేడెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కొందరు బాలీవుడ్ హీరోలు, దర్శక, నిర్మాతల పేర్లు తెరపైకి వచ్చాయి. వాళ్లపై బీహార్ కు చెందిన లాయర్ కేసు వేయడం జరిగింది.
అటు సోషల్ మీడియా నెపోటిజంపై పెద్ద యుద్దమే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆగాలిని టాలీవుడ్ కి మళ్లించి ఇక్కడా నెపోటిజం పీక్స్ లో ఉందని మరోసారి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. దీనిలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలపై అసభ్య పదజాలంతో వ్యాఖ్యానించింది. కొంత మంది ఫ్యామిలీకే చెందిన చేతుల్లో ఇండస్ర్టీ ఉందని..కొత్త వాళ్లకు ఇక్కడ అవకాశాలు రావడం లేదని…ఇదంతా బంధు ప్రీతితో చేస్తున్న పనులని మండిపడింది. ఆఫ్యామిలీ హీరోలే పైకి రావాలని, వాళ్లే బాగుండలని భావించే మనస్తత్వాలు తప్ప! మంచోళ్లు లేరంటూ వ్యాఖ్యానించింది. దీంతో ఇప్పుడా వ్యాఖ్యలు పరిశ్రమ సహా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గామారాయి.
మరి శ్రీరెడ్డి కౌంటర్ గా ఎవరైనా బరిలోకి దిగుతారా? అన్నది చూడాలి. ఎందుకంటే ఇక్కడ నెపోటిజం అంటే ఊరుకోరు. గతంలో అలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొంత మంది పెద్దలు తిప్పికొట్టే ప్రయత్నం చేసారు. సుషాంత్ మరణం నేపథ్యంలో కొంత మంది ఆవేశంతో మాట్లాడినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ నుంచి ఎవరు ముందుకురారు. కానీ టాలీవుడ్ లో లైట్ తీసుకోరు. బాలయ్య లాంటి స్టార్ హీరోనే చిరంజీవి, నాగార్జున ల గురించి మాట్లాడితే మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్లు వేసారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. తాజాగా శ్రీరెడ్డి చిరు-నాగ్ లపై దాడి చేసింది కాబట్టి మళ్లీ మెగా బ్రదర్ సీన్ లోకి ఏమైనా వస్తారేమో చూడాలి.