సల్మాన్ తో ఆ… బంధం లేదట..?

సల్మాన్ ఖాన్, శిల్పా శెట్టి ఇద్దరు డేటింగ్ చేస్తున్నారనే వార్త ఇప్పడు మీడియాలోనూ, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది . సల్మాన్ ఖాన్ పూర్వ చరిత్ర తెలిసిన ఎవరైనా ఈ వార్త నమ్మేస్తారు . ఎందుకంటే గతంలో  ఐశ్వర్య రాయ్ , కత్రినా కైఫ్ , జరీన్ ఖాన్, సంగీత బిజిలానీ, సోమి అలీ, స్నేహాఉల్లాల్, ఆసిన్ , క్లాడియా , డైసీ  షా , క్లోనియా  ఎలా ఎందరితోనో సల్మాన్ ఖాన్ డేటింగ్ చేశాడు . అందుచేత ఇప్పుడు శిల్ప శెట్టి తో డేటింగ్ అనగానే అందరు అది నిజం కావచ్చు అనుకుంటున్నారు .

గతంలోనే వీరు ఇద్దరు ఓం శాంతి ఓం ,  షాదీ కర్కే  పాస్  గయా యార్ , ఫిర్ మిలిగే ,ఫ్రీడే అండ్ హానర్ ,ఔజార్ చిత్రాల్లో నటించారు . అప్పట్లో వీరు కలసి నటించమే కాదు , జీవించారు అనికూడా అంటారు . ఈ విషయం గురించి శిల్ప  ఎం చెప్పిందంటే , “ఆ రోజుల్లో సల్మాన్  ఖాన్ , అర్ధరాత్రి ,అపరాత్రి మా ఇంటికి వచ్చేవాడు , ఆ సమయంలో నేను మాంచి నిద్రలో ఉండేదాన్ని, సల్మాన్ , మా  నాన్నసురేంద్ర శెట్టి ఇద్దరు కలసి మందు కొట్ట్టెవాళ్ళు ” అంటూ  సల్మాన్ తన ఇంటికి వచ్చేవాడని ఒప్పేసుకుంది .

అయితే తన తండ్రి  సురేంద్ర శెట్టి మరణించిన తరువాత కూడా సల్మాన్ తమ ఇంటికి వచ్చేవాడని శిల్ప వప్పుకుంది . తెలుగు, తమిళ,కన్నడ హిందీ సినిమాల్లో నటించింది .  2009లో రాజ్ కుంద్రా ను వివాహం చేసుకుంది. వీరికి ఓ బాబు .

చాలా కాలం తరువాత సల్మాన్ ఖాన్, శిల్పా శెట్టి  ఇద్దరు కలసి అమెజాన్ వారు నిర్వహించే ఓ రియాలిటీ షోలో హోస్టులు గా వున్నారు . ఈ షో సందర్భంగా ఈ పాత స్నేహితులు దగ్గరయ్యారనే వదంతులు వచ్చాయి . 52 సంవత్సరాల సల్మాన్ , 43 సంవత్సరాల శిల్పా రొమాన్సులో మునిగితేలుతున్నారని  రూమర్ సాగుతుంది . వీటి మీద శిల్ప స్పందించింది .  సల్మాన్ ఖాన్  నాకు మంచి  మిత్రుడు , అందరిని ప్రేమించే మంచి మనిషి , కష్ట సుఖాలు బాగా తెలిసిన వాడు . అయితే ఆరోజుల్లో మేము ఎప్పుడు బయటికి కలసి వెళ్ళలేదు . అందరు అనుకుంటున్నట్టు మా ఇద్దరి మధ్య ఏమీ లేదు  అంటున్నది . తాను  రాజ్ కుంద్రా  ఎలా ప్రేమలో పడింది వివరిస్తున్నది . ఎంతైనా బాలీవుడ్  భామలు సరసంలో ఎంత ఆరితేరి పోయారో అలాగే సమర్ధించు కోవడంలో కూడా అంటే  నెర  జాణలు .. కాదంటారా ?