పాపం అల్లుడు ఇంతలా దెబ్బ తీస్తాడని ఊహించలా

                                                     (సూర్యం)

నాగచైతన్యకు మాస్ హీరోలా అనిపించుకోవాలని చాలా కాలం నుంచీ ఉంది. ఆ విషయం ఆ కెరీర్ లో ప్లాఫ్ లుగా నిలిచిన బెజవాడ, ఆటో నగర్ సూర్య , దడ వంటి చిత్రాలు చూస్తే అర్దమవుతుంది.  అయితే ఆ కోరిక తీరేటట్లు కనపడటం లేదు. ఎప్పుడు మాస్ సినిమా చేసినా చీదేస్తోంది.

అయినా సరే పట్టువదలని విక్రమార్కుడులా మాస్ మంత్రం జపిస్తూనే ఉన్నాడు. తాజాగా మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు అంటూ ఓ పక్కా మాస్ సినిమాని వదిలాడు. అయితే అది మాస్ వ్యవహారమే కానీ కాలం చెల్లిన కళాఖండమై ఖండాలు..ఖండాలు గా జనం చీల్చి చెండాడే పరిస్దితి తెచ్చుకుంది.

సినిమాకు అనుకున్న పాత్రలు  అనుకున్న స్థాయిలో పేలకపోవడం..  మారుతి మార్కు ఎంటర్టైన్మెంట్   కూడా పండకపోవడంతో ‘శైలజారెడ్డి అల్లుడు’ అంచనాలకు దూరంగా ఆగిపోయింది. కాకపోతే ప్రోమోలు పుణ్యమా అని ..మొదటి మూడు రోజులు శభాష్ అనిపించుకుంది.

 కానీ సోమవారం నుంచి ఒక్కసారిగా డ్రాప్ అయ్యిపోయింది. దాంతో నాగచైతన్యకు మరోసారి నిరాశే ఎదురైనట్లు అయ్యింది. ఆ తర్వాత వచ్చే సవ్యసాచి కూడా యాక్షన్ సినిమానే అంటున్నారు. దాంతో ఆ సినిమాకు కూడా బిజినెస్ సమస్య వచ్చే అవకాసం ఉంది. ఈ నేపధ్యంలో నాగచైతన్య …ప్రేమ కధా చిత్రాలు ఎంచుకోవాలా..ఫక్తు కమర్షియల్ సినిమాలు చేయాలా అనే సందిగ్ద స్దితికి వచ్చేసారు.