కొన్ని సినిమాలు టాక్ యావరేజ్ గా ఉన్నా కలెక్షన్స్ కుమ్మేస్తూంటాయి. అందుకు కారణం సినిమాలో కంటెంట్ కన్నా…హీరో కటౌట్ లో ఎట్రాక్షన్ నే జనాలని పట్టుకోవటమే. ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య, అను ఇమ్మాన్యూల్ జంటగా డైరక్టర్ మారుతి తెరకెక్కించిన శైలజా రెడ్డి అల్లుడు పరిస్దితి అలాగే ఉంది.
ఈ సినిమామకు రివ్యూలు అన్నీ బ్యాడ్ గా ఉన్నాయి. చూసినవాళ్లంతా బాగోలేదంటూ పెదవి విరిచారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మూడు రోజుల్లో దాదాపు 23 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల టాక్. ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది ప్రక్కన పెడితే ఎంతో కొంత నిజమైతే ఉంటుందనేది నిజం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..మారుతికి ఈ సినిమా పెద్ద మచ్చగా మారింది. పెద్ద హీరోలతో చెయ్యలేడని, పాత ఫార్ములా కథలే నమ్ముకుంటాడని టాక్ పుట్టేసింది.
అదే సమయంలో సినిమాకు కలెక్షన్స్ చెక్కు చెదరకపోవటం, టాక్ తో సంభందం లేకుండా ముందుకు వెళ్లటం మాత్రం నాగ చైతన్య, రమ్యకృష్ణ ఇమేజ్ మాత్రమే అంటున్నారు. మారుతి సినిమాలో ఎంతో కొంత కామెడీ ఉంటుంది సినిమా బాగోపోయినా అని ఆశపడేవాళ్లు సైతం ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. మొత్తానికి చైతుకు బాగా కలిసొచ్చి అతని స్టామినా ఏంటో చెప్పిన ఈ సినిమా…మారుతి కి మాత్రం మైనస్
మార్క్ లు వేయిస్తోంది.
సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే యావరేజ్ టాక్‌తో దూసుకెళుతోంది.