‘భైరవగీత’ డైరక్టర్ గురించి ఆశ్చర్యపోయే నిజం బయిటపెట్టిన వర్మ

కన్నడ నటుడు ధనుంజయ హీరోగా ‘భైరవగీత’ అనే చిత్రాన్ని రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ సమర్పకులు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంభందించి వర్మ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టారు. నిన్న సాయింత్రం ట్రైలర్ ని విడుదల చేసిన వర్మ ..ఇప్పుడు ఆ చిత్రం దర్శకుడు గురించి ఓ విషయం బయట పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. అది మరేదో కాదు ఈ చిత్రం దర్శకుడు సిద్దార్ద తాతోలు ..కేవలం 23 సంవత్సరాల యువకుడు.

source: facebook

అలాగే సిద్దార్ద ఎప్పుడూ ఏ ఫిల్మ్ సెట్ కు వెళ్లలేదు. ఇంజినీరింగ్ చదువుకున్న సిద్దార్ద..సినిమాల మీద ఇంట్రస్ట్ తో సినిమా చూస్తూ నేర్చుకుని ఈ కథ రాసుకుని వర్మని ఇంప్రెస్ చేసి సినిమా చేస్తున్నారు. ఆ విషయం ఆయన తన ఫేస్ బుక్ లో ప్రకటించారు. దాంతో ఇప్పుడు సిద్దార్ద తాతోలు గురించి అందరూ మాట్లాడటం మొదలెట్టారు. అంత చిన్న వయస్సులో డైరక్టర్ అవటం ఒకెత్తు…చాలా ఇంప్రెసివ్ గా తీసి, అందరి దృష్టిలో పడటం మరో ఎత్తు. ఆ విషయంలో హండ్రెడ్ పర్శంట్ సక్సెస్ అయ్యారు సిద్దార్ద తాతోలు.

ఇక ఇందులో హీరోగా చేస్తున్న ధనుంజయ విషయానికి వస్తే ..ఫిల్మ్ ఫేర్ వేడుకలో ఉత్తమ నటుడు (క్రిటిక్ కేటగిరీ) అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ‘భైరవగీత’ సినిమాను వర్మ ప్రకటించారు. తెలుగులో ఈ చిత్రం ‘భైరవగీతం’ పేరుతో విడుదల అవుతోంది. యాక్షన్ మరియు క్లాస్ స్ట్రగుల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథకి ఇంప్రెస్ అయిన నిర్మాత అభిషేక్ నామ చిత్ర హక్కులను సొంతం చేసుకోగా, ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పతాకంపై గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

source: Facebook

నటీన‌టులు:
ధ‌నంజ‌య్, ఇర్రా మిర్ర‌ర్
సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: సిద్ధార్థ్ తాతోలు
నిర్మాత‌లు: అభిషేక్ నామా, భాస్క‌ర్ ర‌స్సీ
స‌మ‌ర్ప‌కులు: రామ్ గోపాల్ వ‌ర్మ
సంగీత ద‌ర్శ‌కుడు: ర‌వి శంక‌ర్
క‌థ‌, స్క్రీన్ ప్లే: రామ్ గోపాల్ వ‌ర్మ/రామ్ వంశీకృష్ణ
సినిమాటోగ్ర‌ఫీ: జ‌గ‌దీష్ చీక‌టి ఎమ్ఎఫ్ఏ
ఎడిట‌ర్: అన్వ‌ర్ అలీ