పవన్, వై ఎస్ జగన్ ఫ్యాన్స్ కి వర్మ స్పెషల్ థాంక్స్..!

ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. కాగా ఈ రాజకీయాల్లో సినిమాలు కూడా మిక్స్ అవ్వడంతో రెండు వేరు వేరు కాదు ఒకటే అని అనిపిస్తుంది. ఇక ఇదిలా ఉండగా వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల కోసం గాను అంతా సిద్ధం అవుతుండగా అప్పటి కోసం ఇప్పటి నుంచే పలు చిత్రాలు టాలీవుడ్ నుంచి వస్తున్నాయి.

అయితే ఆల్ మోస్ట్ అన్ని చిత్రాలు కూడా ఒక పార్టీకి లేదా ఒక వ్యక్తికి ఫేవర్ గా ఉన్నాయి. మరి అలా వస్తున్నా ఓ సినిమానే “వ్యూహం” . దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఏపీ రాజకీయ నాయకులూ చంద్రబాబు. జగన్ సహా పవన్ కళ్యాణ్ లపై తెరకెక్కించగా.. 

దీని నుంచి నిన్న ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా ఎప్పటిలానే వర్మ చిత్రాలకి వచ్చే సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో వర్మ పవన్ కళ్యాణ్, వై ఎస్ జగన్ మరియు చంద్రబాబు లోకేష్ ల అభిమానులకి థాంక్స్ చెప్తున్నాను అని వ్యూహం ట్రైలర్ ని యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో పెట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాని అయితే వర్మ తెలిపాడు.

కాగా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా వర్మ తెరకెక్కించగా మొదటి భాగం ఈ నవంబర్ లో మరో చిత్రం “శపథం” వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపాడు. 
https://x.com/RGVzoomin/status/1713135642086105264?s=20