చిరుపై ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేసిన రామ్ గోపాల్ వర్మ!

ram-gopal-varma_165528333820

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “భోళా శంకర్” తో తన కెరీర్ లోనే మరో దారుణమైన వైఫల్యాన్ని మెగాస్టార్ అందుకోగా ఈ చిత్రంతో మెగాస్టార్ కూడా మళ్ళీ తన సినిమాలు పట్ల పునరాలోచన చేయాల్సి ఉంది.

అయితే మెగాస్టార్ పై ఓ పక్క రీమేక్ చిత్రాలు చేస్తున్నారు అనే మాటతో పాటుగా ఇతర ఇండస్ట్రీలో హీరోస్ అంతా కూడా తమ ఏజ్ సినిమాలు చేస్తుంటే చిరు మాత్రం ఇంకా కుర్రాడిలాంటి పాత్రలే చేస్తున్నాడు అని పలు విమర్శలు ఉన్నాయి. కాగా లేటెస్ట్ గా భోళా శంకర్ కి కూడా ఇదే కామెంట్స్ వినిపించగా..

తాజాగా సంచలనాలు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మెగాస్టార్ పేరు ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా ఇప్పుడు చేస్తున్న ఏవైతే సినిమాలు 60 ఏళ్ళు దాటినా హీరోలు అలాగే 60 ఏళ్ళు ఉన్న వ్యక్తులుగానే కనిపించే అన్ని చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్ లు అవుతున్నాయి.

కమల్ హాసన్ విక్రమ్, రజినీకాంత్ జైలర్ ఇప్పుడు బాలీవుడ్ నుంచిసన్నీ డియోల్ (గదర్ 2) లు అందుకున్నారు అని తెలిపాడు. దీనితో వారంతా తమ ఏజ్ కి తగ్గ సాలిడ్ పాత్రలు చేస్తూ థ్రిల్ చేస్తుంటే మెగాస్టార్ ఏమో ఇంకా మోస పాత్రలే చేస్తున్నాడు అన్నట్టుగా వర్మ ఇంటెన్షన్ ఇందులో కనిపిస్తుంది. దీనితో ఈ పోస్ట్ ఇపుచు వైరల్ గా మారింది.