“ఆలోచనను…ఆలోచించిన మనిషిని చంపలేకపోతే ఏం చెయ్యాలి….ఆ ఆలోచన ఎవరి గురించో వారిని చంపేయాలి..” అంటూ భైరవగీత ట్రైలర్ వచ్చేసింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ చిత్రం నిర్మిస్తున్నారంటే అందులో కంటెంట్,విజువల్స్ ఏ రేంజిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. సినిమా విజయం, పరాజయంలకు సంభంధం లేకుండా హై క్వాలిటీతో ఉంటాయి. తాజాగా ఆయన నిర్మాణంలో రూపొందింన చిత్రం ‘భైరవగీత’.నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఫ్యాక్షన్ ప్రేమకథలో ధనుంజయ్, ఇర్రా మోర్‌లు హీరో హీరోయిన్లు నటించారు. ఈ చిత్రం నవంబర్ 22న విడుదలకానుంది.
నూతన దర్శకుడు సిద్దార్థ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిజంగా జరిగిన ఓ హింసాత్మక ప్రేమ ఆధారంగా తెరకెక్కిందని, ఈ సినిమా ఆసాంతం ఉత్కంఠభరితంగా ఉంటుందని చెప్తున్నారు. ఆ మాటలను నిజం చేస్తూ.. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ అఫీషియల్ గా విడుదల చేసారు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రచార బాధ్యతలను వర్మ దగ్గరుండి చూసుకుంటున్నాడు.
రాయలసీమ నేపధ్యంలో 1991 నాటి కాలంలో ఈ ‘భైరవగీత’ చిత్రం తెరకెక్కింది. ‘తగరు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు వేరే అయినప్పటికీ.. ఈ చిత్రం మాత్రం పూర్తిగా వర్మ శైలిలోనే తెరకెక్కినట్లు అర్దమవుతోంది.