‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు కోటి వ్యూస్..వెనక సీక్రెట్ ఇదే

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఆ సంచలనాలకి ఆజ్యం పోసినట్లుగా ప్రేమికుల రోజు సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్‌కు భారీ రెస్సాన్స్‌రావటమే కాదు రికార్డ్ వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది.ఈ ట్రైలర్ కి ఇప్పటివరకు కోటి వ్యూస్ వచ్చాయి.

వాస్తవానికి మిగతా సినిమాలతో పోలిస్తే అతి తక్కువ బడ్జెట్ , క్వాలిటీతో ఈ సినిమా రూపొందుతోంది.అయినా.. సినిమాలో కంటెంట్ కు జనం కనెక్ట్ అవటం కలిసొచ్చింది. ట్రైలర్స్ లో ఉన్న ఎమోషన్స్ కు తనదైన శైలి ప్రమోషన్స్ తో జనాల్లోకి తీసుకువెళ్లడంలో వర్మ సక్సెస్ అయ్యారు.

సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారిన ఈ ట్రైలర్ రిపీట్ మోడ్ లో చూస్తున్నారు ఆడియన్స్. ఎందుకలా చూస్తున్నారు అంటే ఫెరఫెక్ట్ కాస్టింగ్ అని చెప్పాలి. ఒక్క పేరు కూడా ఎక్కడా చెప్పకపోయినా జనం చంద్రబాబు నాయుడుని, హరి కృష్ణని, బాలకృష్ణ, మోహన్ బాబులను గుర్తు పట్టగలిగారు.

బెస్ట్ కాస్టింగ్ డైరక్టర్ అవార్డ్ ఇవ్వాల్సిన సినిమా ఇది. అంతేకాదు మిమిక్రి ఆర్టిస్ట్ ల చేత కరెక్ట్ గా ఒరిజనల్ వాయిస్ లను ఇమిటేట్ చేయిస్తూ డబ్బింగ్ చెప్పించారు. ఇక నిజ జీవిత పాత్రల బాడీ లాంగ్వేజ్ లను అయితే పూర్తిగా దింపేసారు. ఇవన్నీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ క్లిక్ అవ్వటానికి కారణం అనిపిస్తుంది.