అసిస్టెంట్ల‌కు జీతం కోసేసిన వ్వాటే బ్యూటీ

Rashmika Mandanna

కన్నడ బ్యూటీ రష్మిక మంద‌న‌ తన అందం ప్ర‌తిభ‌తో హృదయాలను దోచింది. ఛ‌లో చిత్రంతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన ర‌ష్మిక కెరీర్ ఆ త‌ర్వాత వెను తిరిగి చూసిందే లేదు. గీతా గోవిందంలో విజయ్ తో.. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో మహేష్ తో.. భీష్మ‌లో నితిన్ తో రొమాన్స్ చేసింది. ఇవ‌న్నీ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో ఇండ‌స్ట్రీలో గోల్డెన్ లెగ్ అన్న పేరు తెచ్చుకుంది.

ప్ర‌స్తుతం `పుష్ప` చిత్రంలో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేస్తోంది. ప్ర‌స్తుతం లాక్ డౌన్ స‌మ‌యాన్ని స్వీయ‌నిర్భంధంలో గ‌డిపేస్తోంది. ప‌నిలో ప‌నిగా రష్మిక తన వ్యక్తిగత సిబ్బందికి ఓ ఫన్నీ టెస్ట్ పెట్టింది. ఈ పరీక్షలో విఫలమైన వారి జీతం స‌గానికి స‌గం కోసేసి షాకిచ్చింది ర‌ష్మిక‌.

రష్మిక తన సిబ్బందికి ఎలాంటి టెస్ట్ పెట్టింది? అంటే.. త‌న‌పై సాధారణ ఆబ్జెక్టివ్ క్వ‌శ్చ‌న్స్ ని రెడీ చేసి ప‌రీక్షించింది. అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, వారిలో ఎక్కువ మంది పరీక్షలో విఫలమయ్యారు. రష్మికకు సంబంధించిన సాధారణ వివరాలు కూడా చెప్ప‌లేక నీళ్లు న‌మిలారు. చాలా ప్ర‌శ్న‌ల‌కు సమాధానం ఇవ్వలేకపోయారు. తన గురించి సాధారణ విషయాలు కూడా తమకు తెలియదని రష్మిక తన సిబ్బందిని ఆటపట్టించి జీతం కోసేస్తున్నాన‌ని తెలిపింది. ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ ర‌ష్మిక‌కు అభిమానిగా మారడంపై ఎంతో ఆనందంగా ఉందిట‌. `సరిలేరు నీకేవ్వ‌రు`లో మైండ్ బ్లాక్ పాట‌‌కు వార్న‌ర్ స్టెప్పులేశాడు. అది కూడా బ్యాటింగ్ చేస్తూ వెరైటీగా.. వాటికి రష్మిక ప‌డి ప‌డీ న‌వ్వేసింది.